BJP President JP Nadda: ‘ది కేరళ స్టోరీ’ సినిమాను వీక్షించిన జేపీ నడ్డా.. తరువాత ఏమన్నారంటే ..

ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీక్షించారు. అనంతరం ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP President JP Nadda: ‘ది కేరళ స్టోరీ’ సినిమాను వీక్షించిన జేపీ నడ్డా.. తరువాత ఏమన్నారంటే ..

BJP President JP Nadda

Updated On : May 8, 2023 / 10:18 AM IST

BJP President JP Nadda: ది కేరళ స్టోరీ (The kerala story) .. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి వివాదం చెలరేగింది. బలవంత మతమార్పిడికి గురై ఐసిస్ లో చేరిన మహిళ కథే ఈ సనిమా. సోదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ  (Ada Sharma) ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా మే5న విడుదలైన విషయం విధితమే. ఒకవర్గాన్ని కించపర్చేలా ఈ సినిమా ఉందంటూ, సినిమాను నిషేధించాలంటూ కేరళ (kerala), తమిళనాడు (tamil Nadu) రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సైతం జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

The Kerala Story: రెండో రోజు సాలిడ్ వసూళ్లతో అదరగొట్టిన ‘ది కేరళ స్టోరి’

ది కేరళ స్టోరీ సినిమా రాజకీయంగానూ చర్చల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సినిమా విడుదల కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ది కేరళ స్టోరీ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా  (BJP National President JP Nadda) వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మందుగుండు సామాగ్రి లేని కొత్త తరహా ఉగ్రవాదం పుట్టుకొచ్చిందని అన్నారు. ఈ చిత్రం విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేస్తుందని చెప్పారు. ఈ రకమైన ఉగ్రవాదం ఏ రాష్ట్రానికి, మతానికి సంబంధించినది కాదన్నారు.

The Kerala Story : ఫస్ట్ డే కలెక్షన్స్‌లో ‘ది కేరళ స్టోరీ’ కాశ్మీర్ ఫైల్స్‌కి డబుల్.. అదా శర్మ పెద్ద హిట్టే కొట్టిందిగా!

కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలోభాగంగా ఓ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సినిమా ఉగ్రవాద కుట్ర నేపథ్యంలో రూపొందిందని చెప్పారు. ఈ చిత్రం తీవ్రవాదం యొక్క అసహ్యకరమైన సత్యాన్ని బయటకు తెలుస్తుందని, ఉగ్రవాదుల రూపకల్పనను బహిర్గతం చేస్తుందని చెప్పారు.

The Kerala Story : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ కానుందా?

ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సినిమాను నిలుపుదల చేస్తున్నారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ సినిమాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ.. లవ్ జిహాద్, మత మార్పిడి, ఉగ్రవాదం యొక్క కుట్రను బహిర్గతం చేస్తుందని అన్నారు.