Rakesh Tikait : ప్రతి రోజు పార్లమెంట్ కి 200 మంది రైతులు

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సృష్టం చేశారు.

Rakesh Tikait : ప్రతి రోజు పార్లమెంట్ కి 200 మంది రైతులు

Tikait

Updated On : July 13, 2021 / 8:40 PM IST

Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సృష్టం చేశారు. జులై-22న రైతులు ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ ముందు కూర్చుంటారని ఆయన తెలిపారు.

ప్రతి రోజూ 200 మంది రైతులు పార్లమెంట్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని టికాయత్ తెలిపారు. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సముఖంగా లేదని, అందుకే తాము ఇక నుంచి పార్లమెంట్ దగ్గర నిరసన చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆందోళనను ఆపే ప్రసక్తే లేదని టికాయత్ తేల్చిచెప్పారు.