Blast In Chemical Factory : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి ముగ్గురు మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకుంది

Blast In Chemical Factory
Blast In Chemical Factory : కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి ముగ్గురు మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా ఘోఘంబ తాలూకాలోని రంజిత్ నగర్ గ్రామానికి సమీపం గల గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ రసాయన తయారీ కర్మాగారంలో చోటుచేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీలోని ఓ భవనం పూర్తిగా ధ్వంసం కాగా.. మరో భవనం గోడలు విరిగిపడ్డాయి. ఈ పేలుడు శబ్దాలు కొన్ని కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు.
చదవండి : Blast: సిలిండర్ పేలుడు.. భారీ ప్రమాదం
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం ఘటన స్థలికి చేరుకొని ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చాయని పంచమమల్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారని, 15 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని, వీరిలో కొందరికి తీవ్ర కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ఆస్తినష్టంపై ఇప్పటివరకు అంచనా వేయలేదని.. తెలిపారు. పేలుడుకి కారణం తెలియరాలేదని వివరించారు. త్వరలోనే కారణాలు తెలుసుకొని మీడియాకు వెల్లడిస్తామని తెలిపారాయణ.
చదవండి : Blast : రైలు పట్టాలపై బాంబు పేలుడు