కళ్ల అద్దాల కోసం, Court Judges కు రూ. 50 వేలు..మహా ప్రభుత్వం ఆమోదం

Bombay High Court లోని ప్రతి న్యాయమూర్తికి కళ్ల అద్దాలు కొనుగోలు చేసేందుకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు government resolution (GR) ను 2020, జులై 20వ తేదీ సోమవారం ఆమోదించింది.
రాష్ట్రాల చట్టం, న్యాయ వ్యవస్థ GR ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు కూడా దీని పరిధిలోకి వస్తారని ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయని వెల్లడించింది.