Goa Rules: గోవా టూరిస్టులకు కొత్త రూల్స్
గోవా వెళ్దామనుకునేవారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని దాంతో పాటు RT-PCR టెస్టు రిపోర్టు నెగెటివ్ తో రావాలని మంత్రి మైఖెల్ లోబో అన్నారు.

Goa Rules
Goa Rules: గోవా వెళ్దామనుకునేవారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని దాంతో పాటు RT-PCR టెస్టు రిపోర్టు నెగెటివ్ తో రావాలని మంత్రి మైఖెల్ లోబో అన్నారు.
‘జులై వరకూ వెయిట్ చేసి కేసుల సంఖ్య జీరో అయ్యాకే ప్రోపర్ స్క్రీనింగ్ వాడి రీ ఓపెన్ చేస్తాం. వ్యాక్సిన్ రెండు డోసులు, నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాల్సిందే’ అని స్పష్టం చేశారు.
కొవిడ్ పరిస్థితి నార్మల్ అయ్యేంతవరకూ కనీసం రెండు నెలలు అయినా వెయిట్ చేయాలి. ఒక నెల పాటు తగ్గుతూ ఉంటే బిజినెస్ మొదలుపెట్టొచ్చు. మొదటి రెండు నెలలు క్లోజ్ గా వాచ్ చేయాలి. ఈ రూల్స్ న్యూ ఇయర్, క్రిష్టమస్ వరకూ కంటిన్యూ చేస్తామని చెప్పడం లేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాటికి ప్రొటోకాల్స్ కు మార్పులు చేసి టూరిస్టులకు ఇబ్బంది లేకుండా చేస్తామని లోబో అన్నారు.
విమానాల్లో వచ్చిన వారిని, రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించడం చాలా ముఖ్యం. గతేడాది 3వేల 22మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనావైరస్ ప్రభావానికి ఎవరూ గురికాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రమాదానికి గురికావడానికి ఎటువంటి అవకాశాలు ఇవ్వదలచుకోలేదు. ఒకవేళ వైరస్ విజృంభిస్తే చాలా కుటుంబాలు నష్టపోతాయి. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
గురువారం గోవాలో.. 229కొత్త కొవిడ్-19కేసులు నమోదుకాగా 258కోలుకుని 9మంది చనిపోయారు. ప్రస్తుతం 2వేల 727యాక్టివ్ కేసులు ఉన్నాయి.