Mayawati : ఇండియా కూటమిలో చేరికపై క్లారిటీ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. అఖిలేష్ యాదవ్ పై కీలక వ్యాఖ్యలు

మాయావతి తన పుట్టినరోజు సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండియా కూటమి, ఎన్డీఏలలో ఎవరివైపు ఉంటారనే విషయంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు.

Mayawati : ఇండియా కూటమిలో చేరికపై క్లారిటీ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. అఖిలేష్ యాదవ్ పై కీలక వ్యాఖ్యలు

Mayawati

Updated On : January 15, 2024 / 1:29 PM IST

Lok Sabha Election 2024: మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికల సమరానికి తెరలేవనుంది. అధికార బీజేపీని గద్దెదింపేందుకు బీజేపీయేతర పార్టీలు ’ఇండియా కూటమి’ పేరుతో ఒకే గొడుకు కిందకు వస్తున్నాయి. అయితే, మరికొన్ని బీజేపీయేతర పార్టీలు తటస్థంగా ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇండియా కూటమిలో చేరుతారా..? ఎన్డీయేవైపు మొగ్గు చూపుతారా అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. తాజాగా మాయావతి తన పుట్టినరోజు సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరివైపు ఉంటారనే విషయంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. బీఎస్పీ ఏ కూటమిలో చేరదని క్లారిటీ ఇచ్చారు.

Also Read : దావోస్‌లో సీఎం రేవంత్ బృందం ఎంతమంది పారిశ్రామిక వేత్తలను కలవనుంది.. పూర్తి వివరాలు ఇలా..

లోక్ సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మాయావతి చెప్పారు. మేం ఎలాంటి పొత్తు పెట్టుకోం. 2007 సంవత్సరంలో వెనకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లింల మద్దతుతో విజయం సాధించాం.. ఆ మాదిరిగానే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు. బీఎస్పీ అత్యున్నత నాయకత్వం వెనుకబడిన వర్గాల చేతిలో ఉంది.. పొత్తు పెట్టుకుంటే మా ఓట్లు వాళ్లకు పడతాయి.. కానీ, వారి ఓట్లు, ముఖ్యంగా అగ్రవర్ణాల ఓట్లు బీఎస్పీకి వచ్చే అవకాశం తక్కువ అని మాయావతి అన్నారు. కూటమిగా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల బీఎస్పీకి నష్టం వాటిల్లుతుందని మాయావతి స్పష్టం చేశారు. దేశంలోని చాలా పార్టీలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయని బీఎస్పీ అధినేత్రి అన్నారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను మాయావతి కొట్టిపారేశారు.

Also Read : PMAYG: పీఎంఏవై జి స్కీం లబ్ధిదారులకు ప్రధాని మోదీ శుభవార్త

లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలు మంచి ఫలితాలు సాధిస్తే అదే నాకు బహుమతి అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. మరోవైపు 2018 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై కూడా మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అతను ఊసరవెల్లిలా రంగు మార్చాడని విమర్శించారు. మాయావతి తాజా నిర్ణయం ఇండియా కూటమికి షాకింగ్ విషయమనే చెప్పొచ్చు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతారని కూటమిలోని చాలా మంది జాతీయ స్థాయి నేతలు ఆశించారు. కానీ మాయావతి ఏ కూటమిలో చేరనని, ఒంటరిగానే నా పయణం అంటూ క్లారిటీ ఇచ్చారు.