దావోస్‌లో సీఎం రేవంత్ బృందం ఎంతమంది పారిశ్రామిక వేత్తలను కలవనుంది.. పూర్తి వివరాలు ఇలా..

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు.

దావోస్‌లో సీఎం రేవంత్ బృందం ఎంతమంది పారిశ్రామిక వేత్తలను కలవనుంది.. పూర్తి వివరాలు ఇలా..

CM Revanth Reddy Davos Tour

Updated On : January 15, 2024 / 12:55 PM IST

CM Revanth Reddy Davos Tour : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు ఉన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. ఇవాళ్టి నుంచి ఈనెల 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గోనున్న రేవంత్ బృదం భారీ పెట్టుబడులే లక్ష్యంగా కృచేయనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ బలాబలాలు, ప్రాధాన్యతలు చాటిచెప్పనున్నారు.

Also Read : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టికెట్లు జనవరి 18 నుంచి విక్రయం.. ఆరోజు వారికి ఫ్రీ ఎంట్రీ

మూడు రోజుల పర్యటనలో సీఎం రేవంత్ బృందం 70 మందికిపైగా పారిశ్రామికవేత్తలను కలవనుంది. అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో వారు భేటీ కానున్నారు. నొవర్తీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజనిక, గూగుల్, యుబర్, మాస్టర్ కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, సీఎక్స్ఓలతో రేవంత్ బృందం భేటీ కానుంది.

Also Read : 67 రోజులు..6700 కి.మీ.. రాహుల్‌ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’

భారత్ దేశానికి చెందిన టాటా, విప్రో, హెచ్సీఎల్ టెక్, జేఎస్ డబ్ల్యు, గోద్రెజ్, ఎయిర్ టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీకానుంది. కీలక రంగాల్లో పెట్టబడులపై సంతకాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్ళే బృందానికి తొలిసారి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కావటం గమనార్హం.