Kerala : ప్యూన్ ఉద్యోగం కోసం క్యూ కడుతున్న ఇంజనీర్లు.. సైక్లింగ్ పరీక్షకు రెడీ..
కేరళలో రెండు రోజులుగా ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగాలకు సైక్లింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి సౌకర్యాలు ఉండటంతో ఇంజనీర్లు సైతం ప్యూన్ ఉద్యోగానికి మొగ్గుచూపుతున్నారు.

Kerala
Kerala : కేరళ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ ఉద్యోగానికి బీటెక్ హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు క్యూ కట్టారు. సైక్లింగ్ పరీక్షలో పాల్గొనేందుకు బారులు తీరారు. వీరందరినీ చూస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం అవుతోంది.
Kerala High Court : జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు
సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి ఉంటోంది. అందుకే ఇప్పుడు ఇంజనీర్లంతా ఉద్యోగ భద్రత, పెన్షన్ ప్రయోజనాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలవైపు మొగ్గు చూపుతున్నారు. కేరళలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్యూన్ ఉద్యోగం చేయడానికి కూడా ఇంజనీర్లు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ప్యూన్ ఉద్యోగానికి అర్హత 7 వ తరగతి .. దాంతో పాటు సైకిల్ తొక్కే సామర్థ్యం కలిగి ఉండాలి. అప్లై చేసేవారు ఖచ్చితంగా డిగ్రీ చదివినవారై ఉండకూడదు. అయినప్పటికీ ఏటా అనేకమంది బీటెక్, గ్రాడ్యుయేషన్ చదివిన వారు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సైకిల్ పరీక్షలో పాల్గొంటున్నారు.
Kerala high court : నాకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య వినతి…కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు
కేరళలో రెండు రోజులుగా పలు కేంద్రాల దగ్గర డిగ్రీ చదువుకున్న యువత సైకిల్‌తో వేచి చూస్తున్న పరిస్థితులు కనిపించాయి. ఉద్యోగ భద్రతతో పాటు రాష్ట్రంలోని యువతకు పెళ్లి విషయంలో ప్రభుత్వ ఉద్యోగం ఉండటం కూడా ప్రధాన ప్రమాణంగా మారడం మరో కారణంగా మారింది. ప్యూన్ ఉద్యోగానికి జీతం దాదాపు రూ.23,000. ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులను అక్టోర్ 26, 27 తేదీల్లో సైక్లింగ్ పరీక్షకు పిలిచారు. ఒకప్పుడు ఆఫీసు అసిస్టెంట్లు సైకిల్ పైనే విధులకు వచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనప్పటికీ ప్యూన్ పోస్టుల కోసం సైక్లింగ్ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి.