బెంగళూరులో కలకలం : కాలేజీ భవనం పైనుంచి దూకి తెలుగు విద్యార్థి ఆత్మహత్య
కర్నాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు శ్రీహర్ష. వయసు

కర్నాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు శ్రీహర్ష. వయసు
కర్నాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు శ్రీహర్ష. వయసు 21 ఏళ్లు. బెంగళూరులోని అమృత స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ స్టూడెంట్. హాస్టల్ లో సమస్యలపై శ్రీహర్ష ప్రశ్నించాడు. అదే అతడి పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ కాలేజీ యాజమాన్యం శ్రీహర్షను కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో శ్రీహర్ష తీవ్ర మనస్తాపం చెందాడు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడని ఫ్రెండ్స్ చెబుతున్నారు. శ్రీహర్ష మృతితో విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. కాలేజీ యాజమాన్యం తీరుకి నిరసనగా క్లాసులు బాయ్ కాట్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు చేపట్టారు. శ్రీహర్ష మృతికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లను, విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. కాగా, శ్రీహర్ష మృతికి కాలేజీ యాజమాన్యమే కారణం అని ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. ఏపీలోని విశాఖపట్నం శ్రీహర్ష స్వస్థలం. శ్రీహర్ష మృతి వార్త విని తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాలేజీ బిల్డింగ్ 7వ ఫ్లోర్ నుంచి హర్ష కిందకు దూకాడని పోలీసులు తెలిపారు. అంత ఎత్తు నుంచి దూకడంతో శ్రీహర్ష తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు. యాజమాన్యం వేధింపులే హర్ష సూసైడ్ కి కారణం అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
హాస్టల్ లో తీవ్రమైన నీటి కొరత ఉందని, ఫుడ్ కూడా సరిగా లేదని వాపోయారు. దీనిపై శ్రీహర్ష నిలదీయడం పాపమైందన్నారు. కాలేజీలో ఆందోళనలకు శ్రీహర్ష కారణం అని ఆరోపిస్తూ యాజమాన్యం అతడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది. హాస్టల్ లో సమస్యలపై శ్రీహర్షకి మద్దతుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో యాజమాన్యం శ్రీహర్షను బెదిరించింది. ప్లేస్ మెంట్స్ క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. కాలేజీ సస్పెన్షన్ గురించి యాజమాన్యంతో శ్రీహర్ష తోటి విద్యార్థులు మాట్లాడేందుకు వెళ్లారు. ఏం జరిగిందో కానీ.. మధ్యలోనే శ్రీహర్ష బయటికి వెళ్లాడు. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకేశాడు.
హర్ష తండ్రి విజయ్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కాలేజీ మేనేజ్ మెంట్ పై ఐపీసీ 306, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాలేజీ హాస్టల్ లో పరిస్థితులపై మేనేజ్ మెంట్ కి సెప్టెంబర్ 23న హర్ష ఫిర్యాదు చేశాడు. కానీ మేనేజ్ మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మేనేజ్ మెంట్ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక.. కెరీర్ స్పాయిల్ అవుతుందని భయపడి.. హర్ష చనిపోయాడని విద్యార్థులు అంటున్నారు. కాగా, శ్రీహర్ష మెరిట్ స్టూడెంట్. క్యాంపెస్ ప్లేస్ మెంట్ లో సెలెక్ట్ అయ్యాడు. రెండు జాబ్ ఆఫర్లు వచ్చాయి. ఒక జాబ్ కి ఏడాదికి రూ.16లక్షలు జీతం కాగా, మరో జాబ్ కి రూ.20లక్షలు జీతం. చదువు పూర్తి కాగానే జాబ్ లో జాయిన్ కావాల్సి ఉంది. ఇంతలోనే దారుణం జరిగిపోయింది.