భలే దొంగలు : Bunty and Babli స్టైల్లో దొంగతనం..చివరకు

  • Published By: madhu ,Published On : July 18, 2020 / 10:51 AM IST
భలే దొంగలు : Bunty and Babli స్టైల్లో దొంగతనం..చివరకు

Updated On : July 18, 2020 / 2:34 PM IST

బాలీవుడ్ హిట్ మూవీ Bunty and Babli మూవీ గుర్తుండే ఉంటుంది కదా..అందులో హీరో, హీరోయిన్లు కలిసి ప్రజలను బోల్తా కొట్టిస్తూ…దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ సినిమాలాగా కొంతమంది చోరీలు చేస్తున్నారు.

ఇదే తరహాలో…చోరీలు చేస్తూ..పోలీసులకు దొరికిపోతున్నారు. ఇలాగే..ఢిల్లీలో దొంగతనానికి పాల్పడిన ఓ జంటను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. Meerut ప్రాంతానికి చెందిన దంపతులు ‘Bunty and Babli’ సినిమా నుంచి ప్రేరణ పొంది దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇళ్లలోకి ప్రవేశించి…ఏదైనా సహాయం కావాలని కోరుతారు. అనంతరం చోరీలకు పాల్పడుతారని తెలిపారు.

వివరాల్లోకి వెళితే : –

తమ ఇంట్లో చోరీ జరిగిందని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత ఇంట్లోకి ప్రవేశించిన దంపతులు..నీళ్లు కావాలని అడిగారు. వీరికి నీళ్లు ఇచ్చిన తర్వాత వంట గదిలోకి వెళ్లగానే దంపతులు ఇంట్లోకి ప్రవేశించారు.

వెంటనే ఓ వ్యక్తి కత్తితో ఆమె గొంతుపై పెట్టగా..మహిళ ఆమె చేతులను వెనక్కి గట్టిగా పట్టేసుకుంది. బీరువా కీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు, వెండి, పట్టీలు ఇతరత్రా దొంగిలించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మీరట్ లో నిందితులు దాక్కున్నట్లు గుర్తించారు. బాబి, పాయల్ దంపతులుగా గుర్తించారు. బాబీ అనే వ్యక్తి ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. వీరిని పట్టుకుని చోరీ చేసిన మొబైల్ ఫోన్లు, వెండి ఆభరణాలను, ఇతరత్ర వాటిని స్వాధీనం చేసుకున్నారు.