మోడీ దిష్ఠి బొమ్మలు తగులబెట్టండి…పబ్లిక్ ప్రాపర్టీ జోలికెళ్లవద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : December 22, 2019 / 11:00 AM IST
మోడీ దిష్ఠి బొమ్మలు తగులబెట్టండి…పబ్లిక్ ప్రాపర్టీ జోలికెళ్లవద్దు

Updated On : December 22, 2019 / 11:00 AM IST

పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)విషయంలో కాంగ్రెస్,అర్బన్ నక్సల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఢిల్లీలోని రామ్ లీలామైదాన్ బీజేపీ ఎన్నికల క్యాంపెయిన్ ను ప్రధాని ప్రారంభించారు. త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ర్యాలీలో ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడుతూ…ముస్లింలందరినీ డిటెన్షన్ సెంటర్ కు తరలించబడతారు అంటూ కాంగ్రెస్,దాని మిత్రపక్షాలు,కొంతమంది అర్బన్ నక్సల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  మీ చదువుకు విలువ ఇవ్వండి. కనీసం పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒకసారి చదవండి. కొంతమంది అయితే దేశంలోని పేదప్రజలకు పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారం చూడటం షాకింగ్ గా ఉంది. చేతుల్లో త్రివర్ణంతో నిలబడి ఉన్నవారు పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడా స్వరం పెంచుతారని నాకు చాలా నమ్మకం ఉంది. నేను రెండుసార్లు గెలిచానని వాళ్లు కోపంగా ఉన్నారని మోడీ అన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాలని గౌరవించాలన్నారు.

చొరబాటుదారులకు,శరణార్థులకు ఓ చిన్న వ్యత్యాసం ఉందని ప్రధాని అన్నారు. చొరబాటుదారులు ఎప్పుడూ తన ఐడెంటిటీపి బయటపెట్టడని,శరణార్థులు తమ ఐడెంటిటీని ఎప్పుడూ దాచిపెట్టరని అన్నారు. ఇప్పుడు చాలామంది చొరబాటుదారులు బయటికొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్లు నిజం ఎందుకు మాట్లాడటం లేదు?వాళ్ల రియాలిటీ బయటపడుతుందని వాళ్ల భయమని,అందుకే వాళ్లు అసత్యప్రచారాలు చేస్తున్నారని మోడీ అన్నారు. కొన్నేళ్ల క్రితం మమతాబెనర్జీ యుపైటెడ్ నేషన్స్ కి వెళ్లారని,బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారని,ఇది ఆగాలని పార్లమెంట్ ముందు ఆమె వేడుకున్నారు. ఇప్పడు ఏమైంది దీదీ? ఎందుకు మీరు మారిపోయారు?ఎందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?ఎన్నికలు వస్తాయ్..పోతాయ్.ఎందుకు భయపడతున్నారు దీదీ అని మోడీ ప్రశ్నించారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోఎన్‌ఆర్‌సి వచ్చింది. అప్పుడు వారు నిద్రపోయారా అని మోడీ ప్రశ్నించారు. తాము కేబినెట్‌లో లేదా పార్లమెంటులో ఎన్‌ఆర్‌సిని తీసుకురాలేదని అన్నారు. మీకు యాజమాన్య హక్కులను ఇవ్వడానికి మేము ఒక చట్టాన్ని ఆమోదిస్తున్నట్లయితే, అదే సెషన్‌లో మిమ్మల్ని బయటకు పంపించడానికి మేము ఒక చట్టాన్ని తీసుకువస్తామా అని మోడీ ప్రశ్నించారు. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత,శాంతి కోసం 33వేలమంది పోలీసు సిబ్బంది తమ జీవితాలను త్యాగం చేశారు. కానీ ఇవాళ వాళ్ల పట్ట ఆందోళనకారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మోడీ అన్నారు. కావాలంటే నా దిష్ఠి బొమ్మలను తగులబెట్టండి కానీ పబ్లిక్ ప్రాపర్టీని తగులబెట్టవద్దని ఆందోళనకారులనుద్దేశించి మోడీ అన్నారు.