Cab Drivers : యువతిపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్లు

కూల్ డ్రింక్ కొనేందుకు షాప్ దగ్గరకు వెళ్లిన యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి యత్నించారు. గొర్రెల కాపర్లు గమనించి అటుగా రావడంతో యువతిని వదిలి పారిపోయారు.

Cab Drivers : యువతిపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్లు

Cab Drivers

Updated On : September 29, 2021 / 6:20 PM IST

Cab Drivers : ఓ యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైగింక వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం బాధిత యువతి తన బంధువుతో కలిసి కూల్ డ్రింక్స్‌, స్నాక్స్ తీసుకునేందుకు హోస్కోట్ సమీపంలో కొత్తగా అభివృద్ధి చేసిన లేఅవుట్‌కు వెళ్ళింది. అప్పుడు బాధితురాలి కారును నలుగురు క్యాబ్ డ్రైవర్లు చుట్టూముట్టారు. చుట్టూ ఎవరు లేకపోవడంతో గట్టిగ కేకలు వేస్తూ వారిద్దరినీ నిందితులు వీడియో తీశారు.

Read More : False Propaganda : టెస్లాపై నెగిటీవ్ ప్రచారం.. న్యాయపోరాటానికి సిద్దమైన ఎలాన్ మస్క్

తమకు రూ.5 లక్షలు ఇవ్వాలని లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు.. యువతిని కారులోంచి బయటకు గుంజి లైంగిక వేధింపులకు దిగారు. సమీపంలోని గొర్రెల కాపరులు గమనించి అటుగా రావడంతో అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఘటన అనంతరం యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను హందెనహళ్లి, మరసంద్ర గ్రామాలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆసిఫ్‌, నవాజ్ పాషా, లియాకత్ పాషా, సల్మాన్ ఖాన్‌లుగా గుర్తించారు.

Read More : Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పాడని.. వియ్యంకుడి హత్య