Gadget In Mask: మాస్క్‌లో ఎలక్ట్రానిక్ డివైజ్‌… పోలీస్ రిక్రూట్ ఎగ్జామ్‌లో మోసం

శాంతి భద్రతలు కాపాడే పోలీస్.. ఆ కొలువులో చేరేందుకు నిర్వహించే పరీక్షలకు బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. మాస్క్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ పెట్టుకుని పరీక్షకు హాజరయ్యాడు...

Gadget In Mask: మాస్క్‌లో ఎలక్ట్రానిక్ డివైజ్‌… పోలీస్ రిక్రూట్ ఎగ్జామ్‌లో మోసం

Police Exam

Updated On : November 20, 2021 / 11:29 AM IST

Gadget In Mask: శాంతి భద్రతలు కాపాడే పోలీస్.. ఆ కొలువులో చేరేందుకు నిర్వహించే పరీక్షలకు బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. మాస్క్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ పెట్టుకుని పరీక్షకు హాజరయ్యాడు. ఎటువంటి మోసాలు జరగకుండా పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇది బయటపడింది. ఆ సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తుండగా హింజవాడీ బ్లూ రిడ్జ్ స్కూల్ లో బయటపడింది ఈ ఘటన.

మాస్క్ లో సిమ్ కార్డ్, బ్యాటరీ, ఒక చిప్ ఉన్నట్లు గమనించారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 720 కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ లో భాగంగా పరీక్షలు నిర్వహించారు. ఆరు జిల్లాల వ్యాప్తంగా 80సెంటర్లలో ఇవి జరిగాయి. ఈ పరీక్షలకు 1.89లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

…………………………………….: ఔటర్‌పై ఘోర ప్రమాదం.. ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు