iNCOVACC: నాసల్ వ్యాక్సిన్ తీసుకుందామనుకుంటున్నారా.. అయితే, ఇది మీకోసమే!

ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ‘ఇన్‌కోవ్యాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు.

iNCOVACC: నాసల్ వ్యాక్సిన్ తీసుకుందామనుకుంటున్నారా.. అయితే, ఇది మీకోసమే!

Updated On : December 28, 2022 / 11:28 AM IST

iNCOVACC: ‘భారత్ బయోటెక్’ సంస్థ తయారు చేసిన కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్‌కోవ్యాక్స్’ వచ్చే నెలలో అందుబాటులోకి రాబోతున్న సంగతి తెలిసిందే. సూది నొప్పి లేకుండా ఉండే, ఈ వ్యాక్సిన్ తీసుకుందామని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, నాసల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది.

Russia: జీ7 దేశాలకు రష్యా షాక్.. ఫిబ్రవరి నుంచి చమురు సరఫరా నిలిపివేత

అదే.. ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ‘ఇన్‌కోవ్యాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. అయితే, కొందరు బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత కూడా మరో అదనపు డోసు తీసునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చేస్తే వ్యాక్సిన్ మరింత సమర్ధంగా పనిచేస్తుందేమో అనుకుంటున్నారు. అయితే, అలా చేయకూడదని సూచిస్తున్నారు నిపుణులు. బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదు. కోవిన్ పోర్టల్ కూడా నాలుగో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ను అనుమతించదు. నిజానికి బూస్టర్ డోసు తర్వాత మరో డోసు తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణుల సూచన.

Police Recruitment: గర్భిణి అభ్యర్థులకు శుభవార్త.. ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే మెయిన్స్ పరీక్షకు అనుమతి

కారణం… బూస్టర్ డోసు తీసుకున్న తర్వాత నాలుగో డోసు తీసుకుంటే, చివరకు అది పనిచేయకుండా తయారయ్యే ఛాన్స్ ఉంది. ‘దీన్ని యాంటీజెన్ సింక్’ అంటారు. అంటే బయటి నుంచి యాంటీజెన్స్‌ను తీసుకుని, వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు తరచూ ప్రయత్నిస్తే చివరకు శరీరం స్పందించడం ఆగిపోతుంది. లేదా నెమ్మదిగా స్పందిస్తుంది. అందువల్లే వ్యాక్సిన్లకు మధ్యలో కొంత విరామం ఇస్తారు. గతంలో వ్యాక్సిన్లు ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మూడు నెలల వ్యవధిలో ఇస్తున్నారు. కాబట్టి, తరచూ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల నాలుగో డోసు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.