ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కాన్వాయ్‌లోని కారు కిందపడి బాలుడు మృతి

  • Published By: vamsi ,Published On : September 12, 2019 / 09:53 AM IST
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కాన్వాయ్‌లోని కారు కిందపడి బాలుడు మృతి

Updated On : September 12, 2019 / 9:53 AM IST

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని కారు ఢీకొట్టడంతో ఆరేళ్ల బాలుడు చనిపోయాడు. తాతమనవళ్లు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో బాలుడి తాత తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో హర్సోలి ముండవర్ రోడ్‌లో చోటు చేసుకోగా.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

పుష్కర్‌లో జరిగిన మూడు రోజుల ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయ సమావేశంలో పాల్గొని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్థాన్‌లోని టిజారా నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చేత్రమ్ యాదవ్ అనే స్థానిక సర్పంచ్ తన మనవడితో కలిసి బైక్ పై  వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మనవడు సచిన్ చనిపోగా.. తాత యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.