పద్మశ్రీ పురస్కార గ్రహీత..ప్రముఖ కార్డియాలజిస్ట్ కెకె అగర్వాల్ కరోనాతో మృతి

భారతదేశంలో ఎంతో పేరుపొందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ క‌రోనాతో క‌న్నుమూశారు. 60 ఏళ్ల వయస్సులో డాక్టర్ అగర్వాల్ కరోనా మహమ్మారి సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత..ప్రముఖ కార్డియాలజిస్ట్ కెకె అగర్వాల్ కరోనాతో మృతి

Dr Kk Aggarwal Died

Updated On : May 18, 2021 / 10:10 AM IST

dr kk Aggarwal died : భారతదేశంలో ఎంతో పేరుపొందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ క‌రోనాతో క‌న్నుమూశారు. 60 ఏళ్ల వయస్సులో డాక్టర్ అగర్వాల్ కరోనా మహమ్మారి సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా సోకిన డాక్టర్ అగర్వాల్ కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది.

డాక్టర్ అగ‌ర్వాల్ సోమ‌వారం రాత్రి 11:30 గంటలకు మృతి చెందారని కుటుంబం ప్రకటించింది. డాక్టర్ కెకె అగర్వాల్ ఆరోగ్యం గురించి వివిధ‌ ర‌కాల వ‌దంతులు వ‌స్తున్నాయ‌ని వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని వారు దానిలో పేర్కొన్నారు. డాక్ట‌ర్ కేకే అగ‌ర్వాల్‌ భార్య కూడా కరోనా బారిన‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె హోం ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు.

డాక్టర్ అగర్వాల్ 2010 పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) మాజీ అధ్య‌క్షుడుగా ఎనలేని సేవలు చేశారు. 62 ఏళ్ల వయస్సులోనూ.. అగర్వాల్ ఈ కరోనా కల్లోలంలో కూడా జనాలను చైతన్యపరిచేందుకు అనేక వీడియోలు, విద్యా కార్యక్రమాలు రూపొందించి విడుదల చేశారు.