Rajasthan : ప్రాణాంతక పురుగుమందు తాగిన యువకుడు.. 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు.. ఆ తరువాత…

రాజస్థాన్‌లో ఓ యువకుడు ప్రాణాంతకమైన పురుగుల మందు తాగాడు. చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ యువకుడికి 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు చేసారు. ఇంతకీ అతను ప్రాణాలు కాపాడగలిగారా?

Rajasthan : ప్రాణాంతక పురుగుమందు తాగిన యువకుడు.. 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు.. ఆ తరువాత…

Rajasthan

Updated On : September 7, 2023 / 6:41 PM IST

Rajasthan : రాజస్థాన్‌లో ఓ ప్రత్యేక కేసు వెలుగు చూసింది. సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రాణాంతక పురుగుమందు తాగిన ఓ యువకుడిని వైద్యులు కాపాడారు.

Rajasthan DSP : దళితుడిపై మూత్రం పోసి .. ఎమ్మెల్యే బూట్లు నాకించిన రాజస్థాన్‌ డీఎస్పీ

రాజస్థాన్ పాలికి చెందిన 35 ఏళ్ల యువకుడికి పెళ్లి కాకపోవడంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. జీవితం మీద విరక్తి కలిగి ఆర్గానో ఫాస్ఫరస్ అనే విష పూరితమైన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. ఈ పురుగు మందు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 3 నెలల పాటు పంటపై పురుగు వాలనివ్వదు. అలాంటి మందు తాగడంతో అతనిని రక్షించడం వైద్యులకు సవాల్‌గా మారింది. బంగర్ మెడికల్ కాలేజీ వైద్యులు ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. అంతేకాదు ఈ కేసులో వారు సరికొత్త రికార్డు సృష్టించారు.

పురుగుల మందు తాగిన యువకుడిని ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి అతని పరిస్థితి విషమంగా ఉంది. బతకడం కష్టమనుకున్నారు. యువకుడికి 24 రోజుల్లో 5 వేల ఇంజెక్షన్లు ఇచ్చారు. 20 రోజులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ దీపక్ వర్మ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పీసీ వ్యాస్ ఆధ్వర్యంలో చికిత్స అందించిన డాక్టర్ల బృందం 24 రోజుల చికిత్స అనంతరం రోగిని ఇటీవలే డిశ్చార్జి చేసింది. డాక్టర్ ప్రవీణ్ గార్గ్, డాక్టర్ భరత్ సేజు, డాక్టర్ భవిషా, డాక్టర్ దినేష్ చౌదరి, డాక్టర్ నిషా శర్మ, డాక్టర్ రవీంద్ర పాల్ సింగ్, డాక్టర్ హీరారామ్ బలోటియా, డాక్టర్ రాజ్‌కుమార్‌ల కృషి వల్ల ఇది సాధ్యమైంది.

Crime News: మణిపూర్‌ తరహా ఘటన.. రాజస్థాన్‌లో యువతిని నగ్నంగా ఊరేగించి, వీడియోలు తీసి..

అమెరికాలోనూ ఈ తరహా ఉదంతం తెరపైకి వచ్చింది. న్యూయార్క్‌లో కేవలం 300 మిల్లీ లీటర్ల క్రిమిసంహారక మందును తాగి వ్యక్తికి 8 రోజుల్లో 760 ఇంజెక్షన్లు ఇచ్చారు.