ATM Rules 2021 : ఆగస్టు 1 నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు!
ఆగస్టు 1 నుంచి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం నిబంధనలలో కొన్ని మార్పులను రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవలే ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచనుంది.

Cash Withdrawal, Transaction Charges To Change Soon
ATM Rules 2021 : ఆగస్టు 1 నుంచి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం నిబంధనలలో కొన్ని మార్పులను రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవలే ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో ఇంటర్ చేంజ్ ఫీజ్‌ను రూ. 2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచనుంది. అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వినియోగంలో ఉన్నాయి. ఆర్‌బీఐ సవరించిన నిబంధనల ప్రకారం.. అకౌంట్ దారులు తమ హోం బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలను పొందవచ్చు. ఆపై ప్రతి నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాలలో ఉచిత లావాదేవీలు మూడు వరకు పొందవచ్చు. మెట్రో యేతర నగరాల్లో ఐదుకు పైగా చేసుకోవచ్చు. 2019 జూన్‌లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులు జరిగాయి. కస్టమర్ ఛార్జీలను ప్రతి లావాదేవీకి రూ .21 కు పెంచడానికి అనుమతించారు.
ఈ పెరుగుదల జనవరి 1, 2022 నుంచి అమలులోకి వస్తుందని ఆర్బిఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. బ్యాంక్ లావాదేవీలు నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిని మించితే.. 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంక్ ఎటిఎంల నుంచి ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) వినియోగదారులు అర్హులు. మెట్రో కేంద్రాలలో మూడు లావాదేవీలు, మెట్రోయేతర కేంద్రాలలో ఐదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఉచిత లావాదేవీలకు మించితే కస్టమర్ ఛార్జీలపై సీలింగ్ / క్యాప్ ప్రతి లావాదేవీకి రూ .20 చెల్లించాలి. మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 115,605 ఆన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ ఏటీఎంలు ఉన్నాయని నివేదిక తెలిపింది.