మహిళలకు భద్రతగా : ఢిల్లీ బస్సుల్లో సీసీటీవీలు,పానిక్ బటన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : December 5, 2019 / 11:56 AM IST
మహిళలకు భద్రతగా : ఢిల్లీ బస్సుల్లో సీసీటీవీలు,పానిక్ బటన్స్

Updated On : December 5, 2019 / 11:56 AM IST

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ్రీవాల్ ప్రకటించారు. ఒక్కో బస్సులో….3సీసీ కెమెరాలు,10 పానిక్ బటన్స్, ఆటోమేటిక్ వెహికల్ లొకేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అన్ని ఒస్సుల కోసం ఓ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ సీటీలో మహిళలకు భద్రతపై భరోసా కల్పించే ఉద్దేశ్యంతో తాము ఈ పని చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే ఉన్న కొత్త బస్సుల్లో సీసీటీవీలు,పానిక్ బటన్ లు,జీపీఎస్ సిస్టమ్ ఉన్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఢిల్లీవాసులకు ఉచిత పబ్లిక్ వైఫై అందించనున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోమొత్తం 11 వేల హాట్ స్పాట్ సెంట‌ర్ల‌ను ఓపెన్ చేయ‌నున్న‌ట్లు కేజ్రీవాల్ బుధవారం చెప్పారు. న‌గ‌రంలోని బస్ స్టాప్ లు దగ్గర 4వేలు,మార్కెట్లు దగ్గర 7వేల హాట్ స్పాట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబ‌ర్ 16న మొదటగా 100 హాట్‌స్పాట్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తామ‌ని, ఆ త‌ర్వాత ప్ర‌తి వారం 500 హాట్‌స్పాట్ల‌ను స్టార్ట్ చేస్తామ‌ని కేజ్రీవాల్ తెలిపారు. మొత్తం ఆరు నెల‌ల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌న్నారు. వైఫై హాట్‌స్పాట్ల ద్వారా ఉచితంగా 1.5 జీబీ డేటా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. దీంతో మ్యానిఫెస్టోలో ఉన్న చివ‌రి వాగ్దానాన్ని నిల‌బెట్టుకున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ చెప్పారు.