కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 11:12 AM IST
కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి

Updated On : March 30, 2020 / 11:12 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా

కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. భారత్ లో ఇప్పటివరకు 1,071 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం(మార్చి 30,2020) తెలిపింది. కరోనాతో 29మంది చనిపోయారు. 99మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాను త్వరగా గుర్తించడం కీలకం అని కేంద్ర ఆరోగ్య శాఖ అంది. ఒక్కరు సహకరించకపోయినా, మన విజయం సాధించలేము అన్నారు.

సామాజిక దూరం పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం:
మన దేశంలో జనసాంద్రత ఎక్కువని, ఒకరి నుంచి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందుకే ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. వంద శాతం ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించారు. సామాజిక దూరం పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ మరీ ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. దేశ ప్రజలందరూ సహకరిస్తేనే లాక్ డౌన్ సక్సెస్ అవుతుందన్నారు. కాగా గత 24 గంటల్లో మన దేశంలో 92 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు కరోనాతో చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 7లక్షల కరోనా కేసులు, 34వేల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 34వేల మంది మరణించారు. కరోనా కేసుల సంఖ్య 7లక్షల 23వేల 643కి పెరిగింది. ఇప్పటివరకు లక్ష 51వేల 4 మంది కోలుకున్నారు. యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యూయార్క్ లో ఇప్పటివరకు వెయ్యి మంది కరోనాతో చనిపోయారు. మరో 2 వారాల్లో అమెరికాలో కరోనా మరణాల రేటు పెరగనుందని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేసింది. జూన్ వరకు కరోనాను కంట్రోల్ చేయడం కష్టమేనని స్వయంగా ట్రంప్ చెప్పడం అమెరికన్లను ఆందోళనకు గురి చేస్తోంది.

భాతర్ లో 1,071 కరోనా కేసులు, 29మరణాలు:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి పెరిగింది. కరోనాతో 29మంది చనిపోయారు. 942మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 100మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో కరోనా పంజా:
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 218కి పెరిగింది. కరోనాతో 8మంది చనిపోయారు. 25మంది కోలుకున్నారు. కేరళలో 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఒకరు చనిపోయారు. గుజరాత్ లో మృతుల సంఖ్య 5కి చేరింది. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య 85కి చేరగా, ముగ్గురు చనిపోయారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్ లో ఇద్దరు మరణించారు. బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లో ఒకరు చొప్పున మరణించారు. తెలంగాణలో 70 కేసులు, ఏపీలో 23కేసులు నమోదయ్యాయి.