Indian Govt Relaxes Covid-19 restrictions : భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలు సడలించిన కేంద్రం
భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ నిభంధనలు కేంద్రం సడలించింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు కోవిడ్ పరీక్షలు, ఎయిర్ సువిధ ఫారమ్‌ను అప్‌లోడ్ చేసే విధానాన్ని ఇకపై నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Indian Govt Relaxes Covid-19 restrictions at International passengers
Indian Govt Relaxes Covid-19 restrictions : భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ నిభంధనలు కేంద్రం సడలించింది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు కోవిడ్ పరీక్షలు, ఎయిర్ సువిధ ఫారమ్‌ను అప్‌లోడ్ చేసే విధానాన్ని ఇకపై నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులలో కొత్త వేరియంట్ల గుర్తింపుకి 2 శాతం ప్రయాణికులకు యాదృచ్ఛిక పరీక్షలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టంచేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారత్ కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ నిభంధనలను గురువారం (ఫిబ్రవరి 10,2023) సడిలింది. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. సడలించిన ఈ నిబంధనలు సోమవారం (ఫిబ్రవరి 13,2023) ఉదయం 11:00 నుండి అమలులోకి రానున్నాయి.
2022 డిసెంబర్ లో పలు దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ల కేసుల పెరుగుదల కొనసాగిన క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాలను స్వీయ-ఆరోగ్య ప్రకటనను (Self-health statement)అప్‌లోడ్ చేయడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తరువాత ఆయా దేశాల్లో కేవిడ్ కేసులు తగ్గాయి. దీంతో భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణీకులకు కోవిడ్ నిబంధనల్ని సడలించింది.గత 4 వారాల్లో చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయ్‌లాండ్, జపాన్ దేశాల్లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనల్ని సడలించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం..గత 28 రోజులలో కోవిడ్ కొత్త కేసుల సంఖ్యలో 89శాతం తగ్గింది. భారత్ లో కూడా కోవిడ్ కొత్త కేసులు తగ్గాయి. దేశం రోజుకు 100 కంటే తక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుందనే ఆందోళనలతో ప్రజలు మరోసారి హడలిపోయారు. కానీ అటువంటి ప్రమాదం ఏమీ లేకపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు మరోసారి వస్తాయా? అనే ఆందోళనలు ప్రజల్ని హడలెత్తించాయి. కానీ కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గటంతో మహమ్మారి బారి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు.