కొండా కోనల్లో హాయ్ జాయ్..నదిలో చేపలు పట్టిన కేంద్రమంత్రి

కొండా కోనల్లో హాయ్ జాయ్..నదిలో చేపలు పట్టిన కేంద్రమంత్రి

Updated On : January 2, 2021 / 11:48 AM IST

Central minister kiren rijiju fishing : న్యూ ఇయర్ వేళ సాధారణంగా ఎక్కువ మంది ఆలయాలకు వెళతారు. ఈ సంవత్సరం అంతా శుభం కలిగే దీవించమని ప్రార్థనలు చేస్తారు. ఇంకొందరైతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రిలాక్స్ అవుతారు. రాజకీయ నాయకులు మాత్రం ప్రజల్లోనే తిరుగుతారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మరి కొత్త ఏడాది వేళ

కేంద్ర మంత్రి అంటే చాలా బిజీ బిజీగా ఉంటారు. అందులోనూ కొత్త సంవత్సరం వేళ మరింత బిజీగా ఉంటారు. అటువంటిది కేంద్ర క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజుజు మాత్రం తనకిష్టమైన పనిచేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. చక్కగా గేలం పట్టుకుని వెళ్లి గలాగలా పారే నదిలో చేపలు పట్టారు. ఈశాన్య భారతంలోని ఓ మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ ప్రాంతంలోని అభివృద్ధి గురించి సమీక్షిస్తూ సరదగా సరదగా నదిలో గేలం వేస్తూ చేపలు పట్టారు మంత్రి కిరణ్ రిజుజు.

శుక్రవారం (జనవరి 1,2021) నాడు మంత్రి కిరణ్ ఈశాన్య భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అభివృద్ధి పనులను సమీక్షించారు. ఓ కొండ ప్రాంతంలో నదిలో చేపలు పట్టి కాసేపు సరదాగా గడిపారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ముచ్చటిస్తూ.. సందడి చేశారు.

వారి ఆటపాటలను స్వయంగా వీక్షించి రిలాక్స్ అయ్యారు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు కిరణ్ రిజుజు. న్యూయర్ మొదటి రోజు ఇలా సరదా సరదాగా గడిచిపోయిందని తెలిపారు. నరేంద్ర మోదీ చేపట్టి ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానికి చేరడం సంతోషంగా ఉందని చెప్పారు.

కిరణ్ రిజుజు వీడియోకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. న్యూఇయర్ వేళ కూడా ప్రజల కోసం కొండ కోనల్లో తిరుగుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విటర్ వేదికగా న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతున్నారు.