Beating the Retreat tunes లో క్రైస్తవ గీతం తొలగింపు

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 04:02 AM IST
Beating the Retreat tunes లో క్రైస్తవ గీతం తొలగింపు

Updated On : January 16, 2020 / 4:02 AM IST

రిపబ్లిక్ డే…జనవరి 26. ఈ పరేడ్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బీటింగ్ ది రిట్రీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ట్యూన్ల జాబితా నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ ఓ శ్లోకాన్ని తొలగించారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైందిగా భావించే..సాంప్రదాయ క్రైస్తవ శ్లోకం అబైడ్ విత్ మిని తొలగించారు. 1950 నుంచి ప్రతి సంవత్సరం ఈ ట్యూన్ వినిపిస్తుంటారు.

ప్రతి సంవత్సరం ట్యూన్లపై సమీక్ష ఉంటుందని, కొత్త ట్యూన్లను ప్రవేశపెట్టే క్రమంలో కొన్నింటిని తొలగించడం జరుగుతుందని రక్షణ శాఖ అధికారి వెల్లడించారు. మహాత్మాగాంధీకి ఇష్టమైన పాట..వందేమాతరం ట్యూన్‌కు చోటు దక్కుతుందని భావిస్తున్నట్లు, దీనితో పాటు ఇతర ట్యూన్లు కూడా ఉన్నాయన్నారు. బీటింగ్ ది రిట్రీట్‌లో సుమారు 30 నుంచి 35 ట్యూన్లు ఉన్నట్లు, సాంప్రదాయ భారతీయ వాయిద్యాలతో వాయించే ట్యూన్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. 

అబైడ్ విత్ మి అనే క్రిస్టయన్ సాంగ్‌ను ప్లే చేస్తారు. ఈ పాట గణతంత్ర అసలు అర్థాన్ని తెలియచేస్తుంది. ఇది మహాత్ముడికి ఎంతో ఇష్టమైన పాటగా భావిస్తారు. ప్రస్తుతం తొలగించిన అబైడ్ విత్ మి 19వ శతాబ్దంలో స్కాటిష్ కవి హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ రాశారు. దీనిని విలియం హెన్రీ మాంక్ స్వరపరిచారు. గణతంత్ర వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. జనవరి 29న రిపబ్లిక్ వేడుకలు ముగుస్తాయి. ఆ రోజు ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ మధ్య బీటింగ్ రీట్రీట్ నిర్వహిస్తారు. ముగింపు సందర్భంగా జనవరి 29వ తేదీన బీటింగ్ ది రిట్రీట్ నిర్వహిస్తారు. 
Read More : అయోధ్య రామ మందిరం నిర్మాణ తేదీలు