కేంద్రం కీలక నిర్ణయం..ఓటీటీలకు తర్వలో మార్గదర్శకాలు విడుదల

కేంద్రం కీలక నిర్ణయం..ఓటీటీలకు తర్వలో మార్గదర్శకాలు విడుదల

OTT platforms ఓటీటీ(OTT)ఫ్లాట్ ఫామ్స్ లో వస్తున్న కొన్ని వెబ్ సీరిస్ లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటీటీలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు తీసుకురానున్నట్టు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

ప్రెస్‌ కౌన్సిల్‌, కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టం, సెన్సార్‌ బోర్డు వంటి వాటి పరిధిలో ఓటీటీలు లేకపోవడంతో అశ్లీలత, హింస, మతపరమైన అంశాల విషయంలో కొన్ని సిరీయల్స్,సినిమాలపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని.. అందుకే త్వరలోనే ఓటీటీ వేదికలకు సంబంధించిన మార్గదర్శకాలు తీసుకొస్తామని ఆయన చెప్పారు. కాగా ఇటీవల హిందూ దేవుళ్లను అవమానించేలా ఉందంటూ ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదులు వచ్చిన వేళ కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తోంది. అనేక కొత్త చిత్రాలు ఓటీటీలోనే విడుదలవుతూ, కోట్లాది రూపాయల మేరకు వ్యాపారం చేస్తున్నాయి. అదేసమయంలో అసభ్యకరమైన రీతిలో వెబ్‌సిరీస్‌లు కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వీటిపై అనేక రకాలైన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఓటీటీలకు గైడ్ లైన్స్ తీసుకొస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది.