Cerebral palsy Disease : ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది సెరిబ్రల్‌ పాల్సీ బాధితులు..భారత్‌లో 25లక్షల మంది

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి తరువాత సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధి గురించి మరోసారి చర్చ నడుస్తోంది.సెరిబ్రల్‌ పాల్సీ అంటే ఏమిటి? నిపుణులు ఏం చెబుతున్నారంట

Cerebral palsy Disease : ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది సెరిబ్రల్‌ పాల్సీ బాధితులు..భారత్‌లో 25లక్షల మంది

Cerebral Palsy Disease

Updated On : March 2, 2022 / 4:58 PM IST

Cerebral palsy Disease : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి తరువాత సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అసలీ సెరిబ్రల్‌ పాల్సీ (cerebral palsy) అంటే ఏమిటి? బాధితుల పరిస్థితి ఏమిటి?వంటి ఎన్నో విషయాలపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భారత్ లో సెరిబ్రల్‌ పాల్సీ (cerebral palsy)(సీపీ) 25 లక్షలమంది బాధితులు ఉన్నారనే విషయం జైన్ నాదెళ్ల మృతితో మరోసారి తెరపైకి వచ్చింది. భారత్‌లో ప్రతి 1000 జననాలకు ముగ్గురు శిశువులు సెరిబ్రల్‌ పాల్సీ (cerebral palsy)జబ్బు బారినపడుతున్నారంటే దీని తీవ్రత దేశంలో ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు..!

భారత్‌లో ప్రతి 1000 జననాలకు ముగ్గురు శిశువులు సెరిబ్రల్‌ పాల్సీ(సీపీ) జబ్బు బారినపడుతుంటే దీన్ని తీవ్రత ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఉందో ఊహించుకోవటానికే భయంగా ఉంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.7 కోట్ల మంది సెరిబ్రల్‌ పాల్సీ (cerebral palsy)తో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి.అలా భారత్ లో సుమారు 25 లక్షల మంది ఈ సెరిబ్రల్‌ పాల్సీ (cerebral palsy)తో బాధపడుతున్నారు.

వీరిలో 72 శాతం మంది గ్రామీణప్రాంతాల్లోనే ఉన్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కడు చెబుతున్నాయి. ఈ వ్యాధి బారినపడిన చిన్నారుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మాట్లాడలేరు. ప్రతి ముగ్గురిలో ఒకరు నడవలేరు. ప్రతి ఇద్దరిలో ఒకరికి వయసుకు తగిన తెలివితేటలు (Intellectual Disability) లోపిస్తాయి. ప్రతి నలుగురిలో ఒకరికి మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఇటువంటి పిల్లల బాధ చూడలేం. ఆడుతు పాడుతు తిరగాల్సిన పిల్లలు అలా కుర్చీలకు పరిమితమైపోయిన పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనువిస్తారో ఊహించుకుంటునే భరించలేదు.

సెరిబ్రల్‌ పాల్సీ ఒకసారి వచ్చిందంటే.. ఇక పోయే పనేలేదు. అది ఇక ఆ చిన్నారిని జీవితాంతం బాధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి తీవ్రత కూడా పెరుగుతుందని చెబుతున్నారు. అంటే ఇక ఆ చిన్నారి పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది తప్ప ఏమాత్రం మెరుగుపడదంటున్నారు.

తాజాగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్‌ సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతూ కన్నుమూయటంతో ఈ భయంకరమైన వ్యాధి గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. అటు వైద్యశాస్త్రంలోను..ఇటు సామాజికంగాను.ఈ క్రమంలో ఈ జబ్బు ఎలా వస్తుంది? దీన్ని కనుగొనడమెలా? చికిత్స ఉంటుందా? తదితర అంశాల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది..

సెరిబ్రల్‌ పాల్సీ..ప్రభావం ఎలా ఉంటుందంటే..
సెరిబ్రల్‌ పాల్సీ బారిన పడితే..మెదడు దెబ్బతింటుంది. మెదడులోని నరాలు దెబ్బతినటంతో ఆయా అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చక్కెర స్థాయులు తగ్గితే కంటిచూపు దెబ్బతింటుంది. ఫిట్స్‌ వస్తాయి. నడక సరిగా ఉండదు. అడుగు తీసి అడుగు వేయాలంటే నరకమే. ఎవరో ఒకరు అనుక్షణం వారిని చూసుకోవాల్సిందే. ఇక ఆక్సిజన్‌ తగ్గితే.. నడకపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. చేతుల కదలికలు తగ్గిపోతాయి. ఫిట్స్‌ వచ్చే ప్రమాదముంటుంది. కాబట్టి నిరతరం పర్యవేక్షించాల్సిందే.

మెదడుకు మరీ ఎక్కువగా ప్రాణవాయువు అందని పరిస్థితి ఎదురైతే.. జీవితాంతం మంచానికి, కుర్చీకే పరిమితం కావాల్సి వస్తుంది. వీరిలో న్యుమోనియా వచ్చే ప్రమాదంకూడా ఎక్కువగానే ఉంటుంది. ఫిట్స్‌ వస్తే త్వరగా కంట్రోల్ లోకి రావు. వీటి వల్ల ప్రాణాపాయం వచ్చే అవకాశముంటుంది. అంటే ఫిట్స్ సమయంలో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ..ఈ వ్యాధి బారిన పడినవారిలో ఎక్కువ మందిలో ఒకటి రెండు అవయవాలపైనే దుష్ప్రభావం పడుతుంది. ఇబ్బందులున్నా ఎక్కువ కాలం జీవిస్తారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Also read : Satya Nadella Son Died : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు జైన్‌ నాదెళ్ల మృతి

సెరిబ్రల్‌ పాల్సీ రావటానికి కారణాలేమిటి..?
-తల్లి గర్భంతో ఉన్న సమయంలో హై బీపీ, డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే అది గర్భంలోని బిడ్డపై ప్రభావం చూపుతుంది..
-తల్లికి సరైన పోషకాహారం లేకపోయినా..గర్భంలో శిశువు ఎదుగుదల తగ్గినా ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది…
-గర్భిణి ఇన్‌ఫెక్షన్ల బారినపడితే..ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది..
-ప్రసవం తరువాత శిశువు జన్మించిన వెంటనే సరిపడా ఆక్సిజన్‌ అందకపోయినా..
-శిశువుకు చక్కెర స్థాయులు తగ్గినా..
-పుట్టిన తర్వాత రెండేళ్లలోపు మెదడుకు మెనింజైటిస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లు సోకినా ఈ వ్యాధి వచ్చే అకాశం ఉంటుంది.
-శిశువు తలకు బలమైన గాయమై మెదడులో రక్తస్రావం జరిగినా.. మెదడు దెబ్బతింటుంది…

లక్షణాలను త్వరగా గుర్తిస్తే..చికిత్స చేయవచ్చు అంటున్న నిపుణులు..
బిడ్డ పుట్టాక ఆరు నెలలు దాటినా..మెడ నిలపలేకపోతుంటే.. 3 నెలలు దాటినా చూడలేకపోతుంటే.. 4-6 నెలల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్‌ వస్తుంటే.. ఎదుగుదల ఆలస్యమవుతున్నా..తల్లిదండ్రులు గుర్తించాలి.ఎందుకు బిడ్డ ఇలా ఉందని అని అనుమానించాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. నిపుణుల సలహాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

బిడ్డల్లో ఇటువంటి లక్షణాలను బట్టి చికిత్స ఉంటుందని..శారీరక కదలికలు తక్కువగా ఉంటే ఫిజియోథెరపీ చేయించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో భాగంగా బిడ్డలకు ఫిట్స్‌ వస్తుంటే దాన్నికి సంబంధించిన మెడిసిన్స్ అందించాలని అలాగే చక్కటి పోషకాహారం అందించాలని చెబుతున్నారు.

Also read : Cerybral Palsy: సెరిబ్రల్ పాల్సీ అంటే ఏంటి? ఎలా సోకుతుంది.. ప్రభావాలేంటి? సత్య నాదెళ్ల కుమారుడి పరిస్థితేంటి..?

ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..గర్భం దాల్చినప్పటినుంచి పోషకాహారం తీసుకోవాలని..ఏఏ సమయాల్లో ఏఏ టీకాలు తీసుకోవాలో తీసుకోవాలని తెలిపారు. అలాగే హైబీపీ రాకుండా..మధుమేహం దరి చేరకుండా చూసుకోవాలని తెలిపారు. ఒక వేళ గర్భిణికి మధుమేహం ఉంటే..అది నియంత్రణలో ఉంచుకోవాలి. శిశువుకు ఆక్సిజన్‌ తక్కువగా అందకుండా ప్రసవ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శిశువు పుట్టిన తర్వాత కొద్దిమందిలో సాధారణంగా 2-4 రోజుల్లో రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడూ పరీక్షిస్తూ.. చికిత్స అందించాలి. తలకు గాయాలు తగలకుండా చూసుకోవాలి.

ఇలా ఆయా పరిస్థితులను బట్టి ముందే గుర్తిస్తే బిడ్డలకు సెరిబ్రల్‌ పాల్సీ అనేది రాకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.