Indian NAVY Alert : హిందూ మహాసముద్రంలో పెరిగిన చైనా నౌకల నిఘా..డ్రాగన్ కుట్రలను తిప్పికొట్టటానికి రె‘ఢీ’గా ఉన్న ఇండియన్ నేవీ

ఇప్పటిదాకా సరిహద్దుల్లో మాత్రమే భారత్‌ను ఇబ్బందిపెట్టాలని చూసిన చైనా.. ఇప్పుడు రూట్ మార్చింది. బోర్డర్‌లో ఎదుర్కొనే దమ్ములేక.. కొత్తగా సముద్రంలో అలజడి సృష్టించేందుకు ట్రై చేస్తోంది. ఏదోరకంగా భారత్‌తో వివాదం పెట్టుకోవటానికి డ్రాగన్ ప్రయత్నిస్తోందనే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికోసం.. హిందూ మహాసముద్రంలో పెరిగిన చైనా నౌకల నిఘా, కదలికలే కారణం. అయితే.. చైనా నావల్ ఫోర్స్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు.. ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంది.

Indian NAVY Alert : హిందూ మహాసముద్రంలో పెరిగిన చైనా నౌకల నిఘా..డ్రాగన్ కుట్రలను తిప్పికొట్టటానికి రె‘ఢీ’గా ఉన్న ఇండియన్ నేవీ

chinese spy ship yuan-wang-5 in indian ocean Indian NAVY Alert

Updated On : December 13, 2022 / 11:34 AM IST

chinese spy ship yuan-wang-5 in indian ocean Indian NAVY Alert : ఇప్పటిదాకా సరిహద్దుల్లో మాత్రమే భారత్‌ను ఇబ్బందిపెట్టాలని చూసిన చైనా.. ఇప్పుడు రూట్ మార్చింది. బోర్డర్‌లో ఎదుర్కొనే దమ్ములేక.. కొత్తగా సముద్రంలో అలజడి సృష్టించేందుకు ట్రై చేస్తోంది. ఏదోరకంగా భారత్‌తో వివాదం పెట్టుకోవటానికి డ్రాగన్ ప్రయత్నిస్తోందనే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికోసం.. హిందూ మహాసముద్రంలో పెరిగిన చైనా నౌకల నిఘా, కదలికలే కారణం. అయితే.. చైనా నావల్ ఫోర్స్‌ కుట్రలను తిప్పికొట్టేందుకు.. ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంది.

భూమి మీదే కాదు.. సముద్రంలోనూ తన పట్టు నిరూపించుకోవాలని చూస్తోంది డ్రాగన్ కంట్రీ. కొన్ని నెలలుగా.. హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలు పెరిగాయ్. డ్రాగన్‌కు చెందిన గూఢచారి నౌక యువాన్ వాంగ్-5.. ఇప్పటికే హిందూ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. అది.. ట్రాకింగ్, నిఘా పరికరాలు కలిగి ఉంది. ఆ నౌక కదలికలను ఇండియన్ నేవీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇదే షిప్.. ఆగస్టులో శ్రీలంకలోని హంబన్ తోట పోర్టులోకి వచ్చింది. దాంతో.. భారత్, శ్రీలంక మధ్య దౌత్యపరమైన వివాదానికి తలెత్తింది. ఈ చైనా రీసెర్చ్ షిప్.. భారత సైనిక స్థావరాలపై స్నూప్ చేసేందుకు వాడుతున్నారని.. భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఈ చైనా గూఢచారి నౌక.. ఇండోనేషియాలోని సుండా జలసంధిలోనూ కనిపించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా నౌక ఎంటరవడంతో.. ఐఓఆర్‌లో పెరుగుతున్న చొరబాట్లు ఆందోళనలను పెంచుతున్నాయ్.

China Spy Ship ‘Yuan Wang 5’ : హిందూ మహాసముద్రంలో చైనా గూఢచార నౌక కలకలం .. భారత్‌పైనే కన్ను

దీనికంటే ముందు.. దాదాపు 200 చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చాయి. ఈ షిప్స్ కూడా ఎలాంటి సమాచారం లేకుండా, చట్టవిరుద్ధంగా ప్రవేశించాయని భారత నావికాదళం తెలిపింది. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ సమీపంలో ఈ బోట్లు చేపల వేట కొనసాగించాయి. అదే సమయంలో.. చైనా నౌకలతో పాటు మరికొన్ని ఐరోపా దేశాల నౌకలు కూడా ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో చేపల వేట నిర్వహించాయి. ఈమధ్యకాలంలో.. డీప్ సీ ఫిషింగ్ ట్రాలెర్లు, ఇతర పడవల కారణంగా.. హిందూ మహాసముద్రంలో చైనా పడవల కదలికలు పెరిగాయ్. చైనా తీరానికి దూరంగా.. డీప్‌ సీ ఫిషింగ్‌ ట్రాలెర్లు ఇక్కడి దాకా రావడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే.. హిందూ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను.. ఇండియన్ నేవీ నిశితంగా పరిశీలిస్తోంది. గూఢచారి నౌకలను పంపుతూ.. చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని చెబుతున్నారు నేవీ అధికారులు. హిందూ మహాసముద్ర జలాల్లో చైనాకు చెందిన అనేక నౌకలు తిరుగుతుంటాయి. ఇందులో.. చైనా చేపల నౌకలతో పాటు నావల్ ఫోర్స్‌కి సంబంధించి.. 4 నుంచి 6 దాకా నిఘా నౌకలు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవి.. ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో.. అనేక అంశాలను నిశితంగా పరిశీలిస్తుంటాయ్. అయితే.. సముద్రంలో భారతదేశ ప్రయోజనాలను రక్షించేందుకు.. ఇండియన్ నేవీ కృషి చేస్తోందని.. నావికాదళ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Navy Chief: హిందూ మహాసముద్రంలో చైనా చర్యలను నిశితంగా గమనిస్తున్నాం: భారత నౌకాదళం

హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన నావల్ షిప్‌లపై నిఘా పెట్టేందుకు.. అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్.. యూఏవీలను రంగంలోకి దించే ఆలోచనలో ఇండియన్ నేవీ ఉంది. ఇవి.. దీర్ఘకాలం పనిచేయడంతో పాటు ఎక్కువ ఎత్తులో ఉండి నిఘా పెడతాయి. ఇందుకోసం.. అమెరికాతో కలిసి ఎంక్యూ-9బి అనే డ్రోన్‌ని డెవలప్ చేయాలని చూస్తోంది ఇండియన్ నావల్ ఫోర్స్. ఈ ఎంక్యూ-9బి డ్రోన్.. ఎంక్యూ9 డ్రోన్‌ మోడల్ లాంటిదే. ఇప్పటికే.. ఎంక్యూ-9 సిరీస్ డ్రోన్‌తో.. హెల్‌ఫైర్ మిస్సైల్‌ని లాంచ్ చేసి.. కాబూల్‌లో అల్‌ఖైదా లీడర్ అల్-జవహారీని చంపేశారు. ఒక్క నేవీ కోసమే కాదు.. త్రివిధ దళాల్లో పది చొప్పున.. వీటిని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది భారత రక్షణ శాఖ. ఇప్పటికే.. ఇండియాతో కలిసి యూఏవీలు డెవలప్ చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని అమెరికా కూడా ప్రకటించింది. ఈ ప్రత్యేక ప్రాజెక్టులు.. అమెరికా ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో పాటు డీఆర్డీవో, ఓ భారత స్టార్టప్ కలిసి పనిచేయబోతున్నాయి. రక్షణ రంగంలో.. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఉన్నందువల్ల.. చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్‌తో కలిసి మానవరహిత డ్రోన్‌లను తయారుచేయాలని నిర్ణయించినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే.. ఉపఖండంలోని తమ మిత్రదేశాలకు కూడా వాటిని అందించాలని నిర్ణయించింది అమెరికా.

China Spy Ship ‘Yuan Wang 5’ : చైనా నిఘా నౌక వల్ల భారత్ కు ఎటువంటి ప్రమాదం..?

మన భద్రతా అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితులు రాకూడదని.. రష్యా-యుక్రెయిన్ యుద్ధం అందరికీ అర్థమయ్యేలా చూపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. హిందూ మహా సముద్రంలో దేశ భద్రతకు భంగం కలగకుండా.. నౌకలు, సబ్‌మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను విస్తృతంగా మోహరిస్తామని చెబుతోంది ఇండియన్ నేవీ. ఇక.. ఆత్మనిర్భర్ భారత్ పట్ల ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు అందించింది. మనకు కావాల్సిన ఆయుధాలను మనమే తయారుచేసుకునేలా.. కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ తోనే నేవీని ఆధునీకరించడంపై దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో ఇండియన్ నేవీ.. మరిన్ని మేడిన్ ఇండియా భద్రతా పరిష్కారాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. తీరప్రాంత భద్రత, సముద్ర భద్రత, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే ఎస్వోపీలతో పాటు స్వదేశీ యుద్ధ నౌకల ఉత్పత్తి, భవిష్యత్తులో కొనుగోళ్లపై.. ఇండియన్ నావల్ ఫోర్స్ ఫుల్ క్లారిటీతో ఉంది.