Chingari Star: Talent Ka Mahasangram..పాల్గొనండి..Rs. 1 కోటి గెలుచుకోండి

భారతదేశంలో TikTok Ban తర్వాత.. ఇండియన్ షార్ట్ వీడియో App Chingari బడే పాపులర్ అయిపోయింది. భారతదేశ సైనికలపై చైనా సైనికులు చేసిన దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఆ దేశానికి చెందిన వాటిని బ్యాన్ చేసుకుంటూ..ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగా చైనా దేశానికి చెందని Apps పై నిషేధం విధించింది. ఈ క్రమంలో Chingari యాప్ డౌన్ లౌడ్ విపరీతంగా పెరిగిపోయాయి. గంటకు లక్ష డౌన్ లోడ్స్ రికార్డ్ అవుతున్నాయి. అంతే గాకుండా..గంటకు 2 లక్షల వ్యూస్ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఈ యాప్ డౌన్ లోడ్స్ కోటి దాటిపోయాయి.
ఇదే జోరును కంటిన్యూ చేసేందుకు Chingari రెడీ అవుతోంది. అందులో భాగంగా…Talent Ka Mahasangram పేరిట కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. బెస్ట్ కంటెంట్ క్రియేటర్లుగా ఇందులో గెలుపొందిన వారు ఏకంగా రూ. కోటి గెలుచుకోవచ్చని ప్రకటించింది.
ప్రతి రాష్ట్రం నుంచి బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రూ. 5 లక్షలు అందించనున్నారు. ఈ కాంటెస్ట్ స్టేట్, నేషనల్ అనే రెండు స్టేజ్‌లలో జరుగుతుంది.
ఏమి చేయాలి : –
మిమిక్రీ, కామెడీ, డాన్స్, యాక్టింగ్, ఇన్నోవేషన్, పాటలు పాడటం అనే కేటగిరిల కింద వీడియోలు చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్‌లో ఎవరైనా పాల్గొనవచ్చు.
ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారు..15 నుంచి 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోను అప్ లోడ్ చేయాలని, ఫెర్మామెన్స్ తో పాటు లైవ్ ఓటింగ్ ఉంటుందని..బెస్ట్ కంటెంట్ క్రియేటర్లకు రూ. కోటి అందిస్తామని..ఆగస్టు 25న విజేతగా ప్రకటించడం జరుగుతుందని చింగారి యాప్ కోఫౌండర్ సుమిత్ ఘోష్ వెల్లడించారు.
జూన్ 15న తూర్పు లడఖ్ గాల్వన్లో చైనా దళాలతో హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. చైనా ఉత్పత్తులను బహిష్కరించడంతో పాటు మొబైల్ యాప్స్ తొలగించాలంటూ దేశంలో డిమాండ్ పెరుగుతోందని అతి తక్కువ సమయంలోనే భారీగా యూజర్లు Chinagari కుటుంబంలో జాయిన్ అయ్యారని అప్లికేషన్ డెవలపర్లు బిస్వాత్మా నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. Chinagari డిమాండ్ పెరగడంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. టిక్‌టాక్ క్లోన్ ప్లాట్‌ఫామ్ అయిన మిట్రాన్ యాప్‌కు ఇప్పటికే జనాదరణను అధిగమించిందని పేర్కొంది.
కస్టమ్ రూపొందించిన ఆడియో, వీడియో ఆధారిత ఉచిత సామాజిక ప్లాట్‌ఫారమ్‌ను 2019లో వీరిద్దరూ అభివృద్ధి చేశారు. ఇప్పుడు వారు తక్కువ వ్యవధిలో మిలియన్ డౌన్‌లోడ్‌ల మైలురాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. Chinagari యాప్ కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసిందని, చాలా మంది పెట్టుబడిదారులు మా యాప్ పై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.