Chris Jordan Catch : అన్ బిలీవబుల్..ఒంటి చేత్తో… ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..
ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ హైలైట్ గా నిలిచింది. వావ్ అనిపించింది. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ ఔట్ అయిన తీరు హైలైట్ గా నిలిచింది.

Chris Jordan Catch
Unbelievable One Handed Catch : ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత జట్టు 3-2తో కైవసం చేసుకుంది. మనోళ్లు ఈ మ్యాచ్ లో కుమ్మేశారు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచగలిగింది. భారత్ విసిరిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఇంగ్లండ్ లక్ష్యఛేదన దిశగా సాగుతున్నట్టు అనిపించినా శార్దూల్ ఠాకూర్ మ్యాచ్ ను మలుపుతిప్పాడు. కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ దూకుడుకు కళ్లెం వేశాడు. ఒకే ఓవర్లో బెయిర్ స్టో, మలాన్ లను అవుట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.
కాగా, ఈ మ్యాచ్ లో ఓ క్యాచ్ హైలైట్ గా నిలిచింది. వావ్ అనిపించింది. ఇలాంటి క్యాచ్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా ఉంది. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ ఔట్ అయిన తీరు హైలైట్ గా నిలిచింది. బౌండరీ దగ్గర ఇంగ్లండ్ ప్లేయర్ జోర్డాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రషీద్ బౌలింగ్‌లో సూర్య డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే లాంగాన్ నుంచి దూసుకొచ్చిన జోర్డాన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే వేగంలో తాను బౌండరీని దాటే ప్రమాదం ఉండటంతో బంతిని రాయ్‌వైపు విసిరాడు. రాయ్ బంతిని అందుకోవడంతో సూర్య వెనుదిరిగాడు. స్కోరు బోర్డులో జోర్డాన్ పేరు లేకపోయినా ఈ క్యాచ్ అతనిదే. బంతిని అందుకున్న సమయంలో రాయ్ నవ్విన తీరు ఈ క్యాచ్ ఎంత అసాధారణమో చూపించింది.
ఇక, భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో తలపడనున్నాయి. తొలి వన్డే మార్చి 23న, రెండో వన్డే మార్చి 26న, మూడో వన్డే మార్చి 28న జరగనున్నాయి. ఈ మూడు వన్డే మ్యాచ్ లకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
Chris Jordan Pulling Off A Michael Jordan Lay-Up!#IndiavsEngland #INDvsENG pic.twitter.com/FrAtVCPhBf
— @TimeTravellerJofraArcher (@JofraArcher8) March 20, 2021