Cinema Hall Water: సినిమా థియేటర్‌లోకి బయటి వాటర్ అనుమతించకపోతే ఉచితంగా మీరే ఇవ్వాలి – హైకోర్టు

సినిమా థియేటర్‌లలోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించకపోతే థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Cinema Hall Water: సినిమా థియేటర్‌లోకి బయటి వాటర్ అనుమతించకపోతే ఉచితంగా మీరే ఇవ్వాలి – హైకోర్టు

Free Water

Updated On : October 5, 2021 / 8:13 AM IST

Cinema Hall Water: సినిమా థియేటర్‌లలోకి బయటి నుంచి మినరల్ వాటర్ అనుమతించకపోతే థియేటర్ యాజమాన్యమే ఉచితంగా మంచినీరు సరఫరా చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. జీ దేవరాజన్ 2016లో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో ఇలా తేలింది. కొన్ని థియేటర్ల వారు సెక్యూరిటీ రీజన్స్ తో బయటి బాటిల్స్ ను అనుమతించడం లేదని జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం బెంచ్ వెల్లడించింది.

తమిళనాడులోని కొన్ని థియేటర్లలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వాటర్ బాటిల్స్, జ్యూస్, ఫుడ్ స్టాల్ లో ఆహారపదార్థాలు అమ్ముతున్నారంటూఓ వ్యక్తి పిటిషన్ వేశారు.

‘డ్రింకింగ్ వాటర్ ను బయట నుంచి అనుమతించకుండా నిషేదిస్తే కచ్చితంగా ఫ్రీగా అందించాలి. స్వచ్ఛమైన తాగునీటిని వాటర్ కూలర్స్ ద్వారా సినిమాహాల్స్ లోనే ఏర్పాటు చేయాలి. అలాంటి నిషేదాజ్ఞలు చేసే ముందే వీటిని ఉంచాలి’ అని కోర్టు ఆర్డర్ వేసింది.

……………………………………………. : అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ స్పెషల్ ఫిలిం

వాటర్ ప్యూరిఫైర్స్ ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు సర్వీస్ చేయాలని ఆదేశించింది. డ్రింకింగ్ వాటర్ కేవలం ఇంటర్వెల్ సమయంలో మాత్రమే కాకుండా సినిమా ఆరంభం కంటే ముందు నుంచి అందుబాటులో ఉండాలి. ఏదైనా కారణంతో ఒక రోజు తాగు నీరు సరఫరా చేయలేకపోతే ప్రత్యేక అరేంజ్మెంట్లు చేయాలి. ఆదేశాలను పట్టించుకోకుండా ఏదైనా హాల్ ఇష్టారీతిన వ్యవహరిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు జడ్జి.