BJP Mayors conclave: చిన్న నగరాలను అభివృద్ధి చేసి, పెద్ద నగరాలపై భారం తగ్గించాలి: మోదీ
బస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ, యాప్ ఆధారిత ఆటో-రిక్షా సేవలు, మల్టీ మోడల్ వంటి అత్యాధునిక పట్టణ రవాణా వ్యవస్థలను అవలంబించడంలో ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ ముందుందని అన్నారు. ఇక దేశంలో మెట్రో వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోందని మోదీ చెప్పారు. 2014కి ముందు దేశంలో 250 కి.మీ. కంటే తక్కువ దూరం మెట్రో ఉందని, నేడు అది 750 కి.మీ. దూరాన్ని దాటి మరో 1,000 కి.మీ నిర్మాణాన్ని చేపట్టుకుంటోందని అన్నారు.

Cities cannot be developed with election centric approach says PM Modi
BJP Mayors conclave: అభివృద్ధి అంతా పెద్ద నగరాల్లో కేంద్రీకృతం అవడం వల్ల.. ఆ నగరాలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, 2-టైర్, 3-టైర్ నగరాలపై శ్రద్ధ వహించి వాటిని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మంగళవారం దేశంలోని భారతీయ జనతా పార్టీకి చెందిన మేయర్లతో నిర్వహించిన సమావేశానికి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోని బీజేపీ పాలనలో ఉన్న వివిధ నగరాలకు చెందిన 118 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎన్నికలు, రాజకీయాలు కేంద్రంగా నగరాలు ముందడుగు వేయలేవని, రాజకీయాలను దాటుకొని అభివృద్ధి చేయాలని బీజేపీ మేయర్లకు మోదీ సూచించారు. ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆలోచించకూడదు. ఎన్నికల కేంద్రీకృత విధానంతో మీరు మీ నగరాన్ని అభివృద్ధి చేయలేరు. నగరాలకు లాభాన్ని చేకూర్చే నిర్ణయాలు చాలాసార్లు ఎన్నికల్లో ఓటమికి దారి తీస్తాయని తీసుకోవడం లేదు’’ అని మోదీ అన్నారు. అలాగే కేంద్ర నిధులపై ఆధారపడకుండా నగర ప్రణాళికలు రచించాలని ఆయన సూచించారు.
ఇదే సందర్భంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులను మోదీ గుర్తు చేసుకుంటూ.. బస్ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ, యాప్ ఆధారిత ఆటో-రిక్షా సేవలు, మల్టీ మోడల్ వంటి అత్యాధునిక పట్టణ రవాణా వ్యవస్థలను అవలంబించడంలో ఇతర రాష్ట్రాల కంటే గుజరాత్ ముందుందని అన్నారు. ఇక దేశంలో మెట్రో వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోందని మోదీ చెప్పారు. 2014కి ముందు దేశంలో 250 కి.మీ. కంటే తక్కువ దూరం మెట్రో ఉందని, నేడు అది 750 కి.మీ. దూరాన్ని దాటి మరో 1,000 కి.మీ నిర్మాణాన్ని చేపట్టుకుంటోందని అన్నారు.
ఇక నగరాల్లో గృహ నిర్మాణం చాలా ముఖ్యమైందని, దీనికి కోసం తమ ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మోదీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 1.25 కోట్ల ఇళ్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలో 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి కొనసాగుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
DMK: పార్టీకి, రాజకీయాలకు డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గుడ్ బై