CAA సెగలు: బెంగళూరు, యూపీల్లో 144సెక్షన్

ఎటువంటి పరిస్థితుల్లోనూ CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణపై అస్సాం, ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కర్నాటకలోని బెంగళూరు, యూపీల్లోనూ సెగలు తాకడంతో.. 144సెక్షన్ అమలుచేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో..
బుధవారం ఉత్తరప్రదేశ్‌లో అనుమతి లేకుండానే ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నియమాలను ఉల్లంఘిస్తూ నిరసనలు చేపట్టారు. సమాజ్ వాద్ పార్టీ మరికొందరితో కలిసి గురువారం చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
కర్ణాటకలో..
ముందస్తు జాగ్రత్తగా కర్నాటకలోని కలాబురాగి ప్రాంతాన్ని మూసివేశారు. ఎక్కడైనా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఉంటే 144సెక్షన్ ప్రకారం శిక్షార్హులని డీసీపీ వెల్లడించారు. దీనిని డిసెంబరు 21వరకూ అమలుచేయనున్నారు.
బెంగళూరులో..
అసెంబ్లీ మూడు రోజుల నిషేదం ఉన్న ఈ సమయంలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదు. పౌరసత్వ చట్ట సవరణపై ఆందోళనలు, నిరసనలు నగర వ్యాప్తంగా జరగకూడదని, లా అండ్ ఆర్డర్ కాపాడటానికే ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.