లాక్ డౌన్ ఉల్లంఘించను…తండ్రి చివరిచూపుకు దూరమైన యోగి

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 10:13 AM IST
లాక్ డౌన్ ఉల్లంఘించను…తండ్రి చివరిచూపుకు దూరమైన యోగి

Updated On : April 20, 2020 / 10:13 AM IST

అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ(ఏప్రిల్-20,2020)ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా రేపు జరగనున్న తన తండ్రి అంత్యక్రియలలో పాల్గొనలేని పరిస్థితి ఉత్తరప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రికి ఎదురయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా యోగి వెల్లడించారు.

లాక్‌డౌన్ వల్ల తండ్రి అంతిమ సంస్కారాలకు తాను హాజరయ్యే వీల్లేకుండా పోయిందని యోగి ఓ లేఖ ద్వారా తెలిపారు. నిజాయితీ, ప్రజా సంక్షేమం కోసం కష్టపడి పనిచేసే గుణం ఆయన నుంచే అలవడ్డాయి. తండ్రిని చివరి క్షణాలలో చూడటానికి వెళ్లాలని భావించాను. కానీ కరోనా వైరస్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రణాళికల రూపకల్పనలో తీరికలేకుండా ఉన్నాను. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలలో పాల్గొనలేను. అంతిమ సంస్కారాల విషయంలో లాక్‌డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నా తల్లి,కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాను అని యోగి ఆ లేఖలో తెలిపారు.

ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్‌గా పదవీవిరమణ చేసిన ఆనంద్ సింగ్ బిస్త్.. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్‌ జిల్లా పంచౌర్ గ్రామంలో నివసిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ అంతిమ సంస్కారాలను రేపు అక్కడే నిర్వహించనున్నారు. ఆనంద్ సింగ్ మృతిపై యూపీ గవర్నర్ అనందీబెన్ పటేల్, బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తదితరులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.