వసంత పంచమి విశిష్టత : ప్రయాగ్‌రాజ్‌ సంగమ్‌‌లో సీఎం పుణ్యస్నానాలు

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 06:29 AM IST
వసంత పంచమి విశిష్టత  : ప్రయాగ్‌రాజ్‌ సంగమ్‌‌లో సీఎం పుణ్యస్నానాలు

Updated On : January 30, 2020 / 6:29 AM IST

దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సిద్దార్థ్‌నాథ్ సింగ్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. స్నానం అనంతరం సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. కాగా..వసంత పంచమి సందర్భంగా గంగా, యమున సంగమంలో భక్తులు భారీ ఎత్తున పుణ్యస్నానాలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని చర్యలు తీసుకున్నారు. 

వసంత పంచమి విశిష్టత శ్రీకరమైన జ్ఞానదీప్తిని పెంపొందించి, బుద్ధిశక్తిని ధీయుక్తిని ప్రసాదించే మాతృశక్తి స్వరూపిణి సరస్వతి. సమస్త సంపదలకు మూలభూమిక- విద్య. లౌకికపరమైన, ఆధ్యాత్మికమైన బ్రహ్మవిద్యకు అధిష్ఠాత్రి- శ్రీవాణి. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ, చైతన్యం, వాక్పటిమ, ఏకాగ్రత, కళావైదుష్యం వంటి అంశాల్ని శ్రీవిద్యగా భారతి అనుగ్రహిస్తుందంటారు. ‘సరస్వతి’ అనే శబ్దానికి సర్వత్రా వ్యాపించిన శక్తి అని అర్థం. మనలో వెల్లివిరిసే, సర్వ అణువుల్లో వ్యాపించి ఉన్న జీవశక్తే సరస్వతి అంశ. జీవుల్లోనే కాకుండా, సకల సృష్టిలో సజీవకళకు ప్రతిరూపంగా సరస్వతిని సమార్చన చేస్తారు. జ్ఞానమే అసలైన సంపద. ఆ సంపదల్ని సంతుష్టిగా అందించే సత్వగుణ స్వరూపిణి సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమినాడు విద్యా వరదాయినిగా అభివ్యక్తమైందంటారు. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తారు. మకర సంక్రమణం తరవాత క్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో వ్యక్తమవుతుంటాయి. చైత్రంతో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభస్వాగతాన్ని పలికే రుతుసంబంధిత పర్వదినం వసంతపంచమి.