దెయ్యాన్ని చూపిస్తే రూ.50 వేలు ఇస్తా: కలెక్టర్ ప్రకటన

హారర్ సినిమాలలో దెయ్యాలను చూసి ఉంటాం. కానీ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అనే డౌట్ అందరికీ వస్తుంది. ఉన్నాయనే నమ్మకం కంటే మీరు వాటిని చూసి ఉంటే రూ.50వేలు మీవే. అదేంటి దెయ్యాన్ని చూస్తే రూ.50వేలు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే.
దెయ్యాలు ఉన్నాయని ఆధారాలు చూపిస్తే రూ.50 వేల క్యాష్ ఇస్తానని ప్రకటించారు ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే. దెయ్యాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. ప్రజల్లో మూఢ నమ్మకాలపై అవగాహన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ విజయ్ చేసిన ఈ ప్రకటన ఒడిషా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు నా స్వంత డబ్బులు ఇస్తానని ప్రకటించారు. చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందని మూఢ నమ్మకాలను ఆసరా చేసుకుని ప్రజలను కొంతమంది మోసం చేస్తున్నారనీ..ఈ క్రమంలో ఒక్కో సందర్భంలో అమాయక ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారనీ అన్నారు.
అటువంటి మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రకటన చేశారనీ కలెక్టర్ విజయ్ అన్నారు. నే వివిధ కారణాలతో ప్రజలు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. వారిని దారుణంగా హింసిస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నాను. ఇటుంటి మోసాలను అరికట్టాలనీ మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశానని ఆయన తెలిపారు. కలెక్టర్ చేసిన ప్రకటనపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.