Gujarat : కారుతో ఢీకొట్టి 9 మంది ప్రాణాలు తీసిన విద్యార్థి.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు
జూలై 20వ తేదీన ఇస్కాన్ వంతెనపై ప్రమాద స్థలంలో గుమికూడిన జనంపైకి జాగ్వార్ కారు వేగంగా దూసుకెళ్లడంతో ఒక కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది చనిపోయారు. జూలై 27న పోలీసులు అతనిపై 1,700 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.

Gujarat High Court
Gujarat High Court : కారుతో ఢీకొట్టి 9 మంది ప్రాణాలు తీసిన విద్యార్థి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. జులైలో అహ్మదాబాద్‌లో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి తాత్యా పటేల్ తన జగ్వార్ లగ్జరీ కారు నడుపుతూ జనాలపై దూసుకెళ్లాడు. కారు ఢీకొని తొమ్మిది చనిపోయారు. మరో 13 మందికి గాయాలు అయ్యాయి. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బుధవారం గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది.
నిందితుడి తరపు న్యాయవాది హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అతడి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ ఎంఆర్ మెంగ్డే ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేసే ప్రసక్తే లేదని కోర్టు గతంలోనే తేల్చి చెప్పింది. ఐపీసీ, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌లు 304, 308 కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Chhattisgarh : అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ స్వాధీనం
జూలై 20వ తేదీన ఇస్కాన్ వంతెనపై ప్రమాద స్థలంలో గుమికూడిన జనంపైకి జాగ్వార్ కారు వేగంగా దూసుకెళ్లడంతో ఒక కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది చనిపోయారు. జూలై 27న పోలీసులు అతనిపై 1,700 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఛార్జిషీట్ లో లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ చేర్చారు. వాహనం అతివేగంగా వెళ్లి జనాన్ని ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.
అదే స్థలంలో గతంలో జరిగిన ప్రమాదం కారణంగా అర్ధరాత్రి దాటిన వంతెనపై జనం గుమిగూడారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించాడు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించలేదని తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న నిందితుడు మద్యం తాగలేదని న్యాయవాది వాదించారు. నేరపూరిత హత్యకు బదులు ఈ కేసును నిర్లక్ష్యంగా పరిగణించాలని, విద్యార్థి కరడుగట్టిన నేరస్థుడు కాదని నిందితుడి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
Pallavi Prashanth: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
కాగా, ప్రాసిక్యూషన్ నేర తీవ్రతను హైలైట్ చేశారు. ఇస్కాన్ ఫ్లైఓవర్ ఘటనకు ముందు నిందితుడు మరో రెండు రోడ్డు ప్రమాదాలు కూడా చేసినట్లు పేర్కొన్నారు. ఇంతకముందు గాంధీనగర్‌లోని ఆలయ సముదాయంలో అదే కారుతో ఢీకొట్టినట్లు విచారణలో వెల్లడైన తర్వాత విద్యార్థిపై పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.