క్షేమంగా తిరిగి రావాలి : విక్రమ్ అభినందన్ ఎవరంటే..

పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్‌పై జాలి, దయ చూపకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. చిత్రహింసలకు గురి చేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. భారత వింగ్ కమాండర్‌పై పాక్ ఆర్మీ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పాక్ మీడియా రిలీజ్ చేసిన ఫొటోలు, వీడియో వైరల్‌గా మారాయి.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్
అయినా చెరగని చిరునవ్వు :
ప్యారాచూట్ ద్వారా ల్యాండ్ అయిన సమయంలో విక్రమ్ ఎలాంటి గాయాలతో లేరు. సురక్షితంగా ఉన్నారు. ఆయనను పట్టుకున్న తర్వాతే.. చిత్రహింసలు పెట్టారు. యుద్ధ ఖైదీని గౌరవించాలన్న కనీస నీతిని పాక్ సైనికులు పాటించలేదు. గౌరవంగా చూడాలన్న జ్ఞానం ప్రదర్శించలేదు. రక్తమోడుతున్న గాయాలు ఉన్నా.. వింగ్ కమాండర్ విక్రమ్ ముఖంలో చిరునవ్వు మాత్రం చెరగలేదు. ఎంతో ధీమాగా సమాధానం చెప్పారు. తన వివరాలు వెల్లడించారు కానీ లక్ష్యాన్ని మాత్రం చెప్పలేదు.
Also Read:పాక్ ను తక్కువ అంచనా వేయొద్దు : ప్రతిచర్య చూపించామన్న ఇమ్రాన్ ఖాన్
ఎవరీ విక్రమ్ అభినందన్ :
పాక్ సైన్యానికి పట్టుబడ్డ విక్రమ్ అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్ మార్షల్‌గా పనిచేశారు. ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది.
బందీ విజువల్స్ చూపించొద్దు :
విక్రమ్ అభినందన్ ను పట్టుకుని చిత్రహింసలు పెడుతున్న వీడియోను చూపించొద్దు అంటూ మీడియాతోపాటు సోషల్ మీడియాను కోరారు అతని తల్లిదండ్రులు. ఈ ఒక్క వీడియో వల్ల దేశం మొత్తం వెనక్కి తగ్గినట్లు చిత్రీకరించే ప్రమాదం ఉందని.. ఎందరో మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అన్నారు. ఆ వీడియోను చూపించొద్దు అని వారు విజ్ఞప్తి చేశారు.
Also Read:72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు