LPG gas Prices : భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ధర ఎంతంటే?
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగ్గా.. గృహ అవసరాలకు వినియోగించే ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

LPG Gas
LPG Cylinder Prices Hiked : గ్యాస్ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. మార్చి నెల ప్రారంభం కావడంతో గ్యాస్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై అదనంగా రూ. 25.50 పెరిగింది. ఈ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,027కు చేరింది. విజయవాడలో రూ. 1,959గా ఉంది.
Also Read : LPG gas Prices : ఎన్నికల వేళ.. గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట..
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీఎల్సీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) గత నెలలోని సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా ప్రతీనెల 1వ తేదీన కమర్షియల్, డొమస్టిక్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఇవాళ మార్చి1 కావడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగ్గా.. గృహ అవసరాలకు వినియోగించే ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని పలు నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలీండర్ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో రూ. 1,795కు చేరగా.. కోల్ కతాలో రూ. 1,911, ముంబైలో రూ.1,749, చెన్నైలో రూ. 1,960కు పెరిగాయి.