CBI Raids: మరో 1,000 దాడులు చేసుకోండి.. రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి బీజేపీ సీరియల్ కిల్లర్‌లా వ్యవహరిస్తోంది: సిసోడియా

‘‘మరో 1,000 దాడులు చేసుకోండి.. మీకు ఏమీ దొరకదు. ఢిల్లీలో విద్యారంగ అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. అదే నేను చేసిన నేరమా? మేము చేసిన పనులపై ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది’’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా ఒక్కరోజు అసెంబ్లీ సెషన్ నిర్వహించింది.

CBI Raids: మరో 1,000 దాడులు చేసుకోండి.. రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి బీజేపీ సీరియల్ కిల్లర్‌లా వ్యవహరిస్తోంది: సిసోడియా

CBI Raids

Updated On : August 26, 2022 / 12:52 PM IST

CBI Raids: ‘‘మరో 1,000 దాడులు చేసుకోండి.. మీకు ఏమీ దొరకదు. ఢిల్లీలో విద్యారంగ అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను. అదే నేను చేసిన నేరమా? మేము చేసిన పనులపై ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది’’ అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా ఒక్కరోజు అసెంబ్లీ సెషన్ నిర్వహించింది.

ఇందులో మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ‘‘సీబీఐ అధికారులు 14 గంటలు జరిపిన సోదాల్లో నా దుస్తులతో పాటు నా పిల్లల దుస్తుల్లోనూ సోదాలు చేశారు. అయినప్పటికీ వారికి ఏమీ లభ్యం కాలేదు. మా మద్యం పాలసీ వల్ల ప్రజలపై ఎటువంటి భారమూ పడలేదు. అంతేగాక, ప్రభుత్వ రెవెన్యూ పెరిగింది. అయినప్పటికీ, ఆ పాలసీలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చడానికి బీజేపీ సీరియల్ కిల్లర్ లా వ్యవహరిస్తోంది’’ అని మనీశ్ సిసోడియా అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీపై ఆప్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను మభ్యపెట్టి, ఆశ చూపి, బెదిరించి చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు జరుపుతోందని అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మనీశ్ సిసోడియా ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేశారని ఆప్ ఆరోపించింది. మనీశ్ సిసోడియా ఇంటిపై సీబీఐ అధికారులు ఇటీవల సోదాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇతర 30 ప్రాంతాల్లో సీబీఐ దాడులు కొనసాగాయి. మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో