Sonia Gandhi on ‘Bharat Jodo Yatra’: అందుకే నేను కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొనలేకపోతున్నాను: సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. ‘‘వైద్యం నిమిత్తం నేను విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చారిత్రక ‘భారత్ జోడో’ యాత్ర ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. ఇది మన మహోన్నత పార్టీకి మైలురాయి వంటిది. దీనితో మన పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Sonia Gandhi on ‘Bharat Jodo Yatra’: అందుకే నేను కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొనలేకపోతున్నాను: సోనియా గాంధీ

Sonia Gandhi on 'Bharat Jodo Yatra'

Updated On : September 7, 2022 / 6:35 PM IST

Sonia Gandhi on ‘Bharat Jodo Yatra’: కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. ‘‘వైద్యం నిమిత్తం నేను విదేశాల్లో ఉంటున్న నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభ సభలో పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చారిత్రక ‘భారత్ జోడో’ యాత్ర ఇవాళ సాయంత్రం ప్రారంభం కానుంది. ఇది మన మహోన్నత పార్టీకి మైలురాయి వంటిది. దీనితో మన పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

‘‘భారత రాజకీయాల్లో ఇది ఓ గొప్ప మార్పును తీసుకువచ్చే అంశం. ఆ యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలందరికీ అభినందనలు తెలుపుతున్నాను. నేను సమీప భవిష్యత్తులో పాదయాత్రలో పాల్గొంటాను’’ అని సోనియా గాంధీ చెప్పారు. కాగా, కన్యాకుమారిలో కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు