10రోజుల్లో రెండోసారి…హాస్పిటల్ లో డీకే శివకుమార్

  • Published By: venkaiahnaidu ,Published On : November 12, 2019 / 03:10 AM IST
10రోజుల్లో రెండోసారి…హాస్పిటల్ లో డీకే శివకుమార్

Updated On : November 12, 2019 / 3:10 AM IST

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. గడిచిన 10రోజుల్లో ఆయన ఇప్పుడు రెండోసారి హాస్పిటల్ లో చేరారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో సోమవారం రాత్రి ఆయన బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇంతకు ముందు ఈనెల 1న కూడా ఆయన రక్తపోటు, చక్కెర స్థాయి నిలకడగా లేకపోవడంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే.

పన్ను ఎగవేత,మనీలాండరింగ్ కేసులో ఇటీవల తీహార్ జైలుకు వెళ్లిన డీకే, గత అక్టోబర్ 23న హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో తిరిగి బెంగళూరు చేరుకున్నారు. అప్పటి నుంచి తిరిగి పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో తరచు శివకుమార్ అస్వస్థతకు గురవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.