మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా నానా పటోలే

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 07:28 AM IST
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా నానా పటోలే

Updated On : December 1, 2019 / 7:28 AM IST

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత నానా పటోలే అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిసాన్‌ థోరే పోటీ నుంచి తప్పుకోవడంతో పటోలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశానికి కొద్ది గంటల ముందే బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్‌, సీనియర్‌ నేతలు పటోలేకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో స్పీకర్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం సంప్రదాయంగా వస్తోంది.

ఈ క్రమంలో బీజేపీ.. స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసినప్పటికీ సంప్రదింపుల తర్వాత పోటీకి కొన్ని నిమిషాల ముందు తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ వాల్‌సే పాటిల్‌ పర్యవేక్షణలో శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెలిసిందే. 56 ఏళ్ల పటోలే కాంగ్రెస్‌ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విదర్భ ప్రాంతంలోని సకోలీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.