Rahul Gandhi Video: ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ఏం చెప్పారంటే ..

రాహుల్ షేర్ చేసిన వీడియోలో.. ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. వారితో కలిసి చాక్లెట్ తయారీలో ..

Rahul Gandhi Video: ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ఏం చెప్పారంటే ..

Rahul Gandhi

Rahul Gandhi Chocolate Factory Visit: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ మోడిస్ చాక్లెట్ కథనాన్ని చెప్పారు. 70 మంది మహిళల బృందంతో ఊటీలోని ప్రసిద్ధ చాక్లెట్ ఫ్యాకర్టీ నడుస్తుందని తెలిపారు. మోడిస్ చాక్లెట్ల కథ భారతదేశం యొక్క సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గొప్ప సామర్థ్యానికి ఒక గొప్ప సాక్ష్యం అని రాహుల్ చెప్పారు.

Rahul Gandhi at Kargil: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింల పరిస్థితి మారుతుందా? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే?

రాహుల్ షేర్ చేసిన వీడియోలో.. ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. వారితో కలిసి చాక్లెట్ తయారీలో రాహుల్ నిమగ్నమవటం ఈ వీడియోలో చూడొచ్చు. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీపై ఎంత జీఎస్టీ విధిస్తారో రాహుల్ ఫ్యాక్టరీ యజమాన్యంను ప్రశ్నించారు. 18శాతం జీఎస్టీ కట్టడం జరుగుతుందని తెలుసుకున్న రాహుల్.. ఇది యావత్ దేశానికి సంబంధించిన సమస్య అని అన్నారు. అనంతరం ఓ చిన్నారి నుంచి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

BJP Leaders on Rahul Gandhi: లధాఖ్‭లో రాహుల్ గాంధీ బైక్ రైడింగ్ చేస్తే బీజేపీ నేతలకు ఎందుకు అంత ఆనందం?

మోదీ ఇంటిపేరు కేసు విషయంలో సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి ఇటీవల ఊరట కల్పించిన విషయం తెలిసిందే. మళ్లీ ఎంపీ హోదాలో రాహుల్ గాంధీ వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని సందర్శించారు. ఈ క్రమంలో తమిళనాడులోని ఊటీకి కూడా వెళ్లారు. ఊటీ సమీపంలోని ముత్తనాడు గ్రామంలో తోడా గిరిజన సంఘం ప్రజలను కలిశారు. రాహుల్ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ పర్యటనలో రాహుల్ చాక్లెట్ ఫ్యాక్టరీనికూడా సందర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ పర్యటనలో ఉన్నారు. రాహుల్ తల్లి, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ కూడా శనివారం శ్రీనగర్ చేరుకున్నారు. వారిరువురు కలిసి పలు ప్రదేశాలను సందర్శించనున్నారు.