Siva Shankarappa : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 92ఏళ్ల కాంగ్రెస్ నేత శివశంకరప్ప మరోసారి గెలుపు
2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

SivaShankarappa
Karnataka Elections Results 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హస్తం పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అంత్యంత వయోవృద్ధుడు శివశంకరప్ప మరోసారి విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ నేత శివశంకరప్ప(92) దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వయోవృద్ధుడిగా రికార్డు నెలకొల్పారు. శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరం దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఐదు ప్రధాన కారణాలు ఇవే
2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజీ అజయ్ కుమార్ ను బీజేపీ బరిలో దింపింది.
ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలకు అజయ్ కుమార్ కు మంచి సంబంధాలున్నాయి. అయితే, బీజేపీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కానీ, బీజేపీ అంచనాలను తలకిందులు చేస్తూ దావణగెరె నియోజకవర్గ ప్రజలు మరోసారి శివశంకరప్పకే పట్టం కట్టారు.