Congress president election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు శశి థరూర్ సమాధానం

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై ఆయనను మీడియా ఇవాళ అడగగా స్పందించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన కారులో వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ... దీనిపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని అన్నారు. అయితే, తాను మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’లో రాసిన ఆర్టికల్ లోని అంశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

Congress president election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారా? అన్న ప్రశ్నకు శశి థరూర్ సమాధానం

Congress president election

Updated On : August 30, 2022 / 12:04 PM IST

Congress president election: కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై ఆయనను మీడియా ఇవాళ అడగగా స్పందించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆయన కారులో వెళ్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ… దీనిపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని అన్నారు. అయితే, తాను మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’లో రాసిన ఆర్టికల్ లోని అంశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక నిర్వహించడం కాంగ్రెస్ కు మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. మిగతా అంశాలపై ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కాగా, శశి థరూర్‌ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’లో ఆయన తాజాగా రాసిన ఓ ఆర్టికలే కారణం. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఆసక్తి చూపే అవకాశం ఉందని అన్నారు. దీంతో ఆయన కూడా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. దేశ వ్యాప్తంగా పీసీసీ ప్రధాన కార్యాలయాల్లో పోలింగ్ జరనుంది. అయితే, ఈ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని శశి థరూర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం కూడా ఎన్నిక జరిగితే భారత్ వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.

COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదు