కాంగ్రెస్ కు షాక్ : చౌకీదార్ చోర్ హై ప్రకటనపై ఈసీ బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 10:34 AM IST
కాంగ్రెస్ కు షాక్ : చౌకీదార్ చోర్ హై ప్రకటనపై ఈసీ బ్యాన్

Updated On : April 18, 2019 / 10:34 AM IST

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ  కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చౌకీదార్ చోర్ హై అడ్వర్టయిజ్ మెంట్ క్యాంపెయిన్ ను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. వెంటనే చౌకీదార్ చోర్ హై ప్రకటన  క్యాంపెయిన్ ను ప్రసారం చేయడం ఆపేయాలని బుధవారం(ఏప్రిల్-18,2019) అన్ని జిల్లాల అధికారులకు జాయింట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నోటీసు జారీ చేశారు.

మీడియా సర్టిఫికేషన్ అండ్ ఇన్స్ పెక్షన్ కమిటీ…కాంగ్రెస్ అడ్వర్టయిజ్ సర్టిఫికేషన్ ను రద్దు చేసిందని,వెంటనే దీని ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశించారు.అంతేకాకుండా కాంగ్రెస్ పై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వీఎల్ కాంతారావు ఆదేశించారు.కాంగ్రెస్ పార్టీ రూపొందించిన చౌకీదార్ చోర్ హై ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు కంప్లెయింట్ చేయడంతో ఈసీ  ఈ నిర్ణయం తీసుకుంది. 
Also Read : మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్