ఏలియన్.. పీఎంఓకు పిచ్చోడి మొయిల్‌

కొన్ని వార్తలు ప్రశ్నలను రేకెత్తిస్తాయి.. మరికొన్ని ఆసక్తి రేపుతాయి.. మరికొన్ని అనుమానాలను కలిగిస్తాయి. ఇలాంటి వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 09:26 AM IST
ఏలియన్.. పీఎంఓకు పిచ్చోడి మొయిల్‌

కొన్ని వార్తలు ప్రశ్నలను రేకెత్తిస్తాయి.. మరికొన్ని ఆసక్తి రేపుతాయి.. మరికొన్ని అనుమానాలను కలిగిస్తాయి. ఇలాంటి వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కొన్ని వార్తలు ప్రశ్నలను రేకెత్తిస్తాయి.. మరికొన్ని ఆసక్తి రేపుతాయి.. మరికొన్ని అనుమానాలను కలిగిస్తాయి. ఇలాంటి వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర పూణెలోని కొథ్రూడ్ ఏరియాలో 47 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను ఢిల్లీలోని మోడీ ఆఫీస్ కు ఓ మెయిల్ చేశాడు. దాని సారాంశం ఏంటో తెలుసా.. మా ఇంటి దగ్గర ఏలియన్ తిరుగుతుంది.. నాకు కనిపించింది. భూమిపై ఉన్న సమాచారాన్ని తన గ్రహానికి చేరవేస్తుంది.. వెంటనే దాన్ని పట్టుకోండి. లేకపోతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అంటూ ఈ-మెయిల్ చేశాడు. 

ఢిల్లీలోని పీఎంవో ఆఫీస్ కు వచ్చిన ఈ-మెయిల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖకు ఫార్వర్డ్ చేశారు. ఆ ఏలియన్ సంగతి తేల్చాలని ఆదేశించారు. మోడీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తే ఊరుకుంటారా ఏంటీ.. వెంటనే స్పెషల్ టీం రంగంలోకి దిగింది. మెయిల్ చేసిన వ్యక్తి ఆచూకీ కనుక్కుని పట్టుకున్నారు. అతన్ని విచారించారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. ఆ వ్యక్తికి మైండ్ సరిగా లేదని. మానసిక స్థితి బాగోలేదని నిర్థారించారు.

ఇక్కడ మరో విషయం హాట్ టాపిక్ అయ్యింది. పిచ్చోడు అయితే మోడీ ఆఫీస్ ఈ-మెయిల్ అడ్రస్ ఎలా తెలుసు.. అతను ఎలా తెలుసుకోగలిగాడు అనే ప్రశ్నపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోతే.. ఎవరికైనా మెయిల్ చేయొచ్చుకానీ.. పీఎంవో ఆఫీస్ కే ఎలా చేస్తాడనేది కూడా పాయింట్ అయ్యింది. ఏదిఏమైనా ఏలియన్ మెయిల్ స్టోరీ మాత్రం వైరల్ అయ్యింది.