Converted Muslims: గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆందోళనలో కన్వర్టడ్ ముస్లింలు

ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకి మారిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆందోళన మొదలైంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు రిజర్వేషన్ అమలుకావడంపై అసంతృప్తి..

Converted Muslims: గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఆందోళనలో కన్వర్టడ్ ముస్లింలు

Tnpsc

Updated On : March 28, 2022 / 6:36 PM IST

Converted Muslims: ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకి మారిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆందోళన మొదలైంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఉద్యోగాలకు రిజర్వేషన్ అమలుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల నుంచి క్రిష్టియానిటీలోకి వచ్చిన వారిని వెనుకబడిని తరగతుల కింద పరిగణిస్తున్నారని, ముస్లిం మతంలోకి మారిన వారిని అలా పరిగణించడం లేదని ఆరోపిస్తున్నారు.

మనితానీయ మక్కల్ కచ్చి సభ్యులు, ఎమ్మెల్యే అయిన ఎంహెచ్ జవహిరుల్లాహ్ ఈ విషయాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి పలనివేల్ త్యాగరాజన్ దృష్టికి తీసుకొచ్చారు. మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ జీఎమ్ అక్బర్ సైతం ఈ విషయంపై రాష్ట్ర ఆర్థిక మంత్రికి రిక్వెస్ట్ పంపారు.

“ఈ పద్ధతిని సరిదిద్దాలి. ఇస్లాంలోకి మారిన వ్యక్తులు తమను తాము వెనుకబడిన తరగతి ముస్లింలుగా నమోదు చేసుకునే వీలు కల్పించాలి. కన్వర్టెడ్ ముస్లిం’ అనే ఆప్షన్‌ను తీసుకున్న వారిని ‘ఇతరులు’ (ఓపెన్ కేటగిరీ)గా పరిగణిస్తామని ప్రభుత్వ ఉత్తర్వులను ఉటంకిస్తూ పాప్-అప్ సందేశం పంపుతున్నారని చెప్తున్నారు”

Read Also: సుప్రీం కోర్టు మెట్లెక్కనున్న ముస్లిం విద్యార్థులు

”మతం మారిన క్రిస్టియన్లకు అలాంటి హద్దులేమీ లేవ”ని మాజీ న్యాయమూర్తి అన్నారు.

ఆర్థిక మంత్రి త్యాగరాజన్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ టీఎన్‌పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ఈ విషయాన్ని తాను టీఎన్‌పీఎస్సీకి సూచించినట్లు చెప్పారు. సమాధానం కోసం వేచి చూస్తున్నామని, సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. యూఏఈ పర్యటన నుంచి తిరిగి రాగానే సీఎం స్టాలిన్‌ ముందు ఇదే విషయంపై చర్చిస్తామన్నారు.