భారత్ లో 4789 కు చేరిన కరోనా కేసులు… 124 మంది మృతి 

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

  • Published By: veegamteam ,Published On : April 7, 2020 / 11:49 PM IST
భారత్ లో 4789 కు చేరిన కరోనా కేసులు… 124 మంది మృతి 

Updated On : April 7, 2020 / 11:49 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్‌డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఓ వైపు కేసులు పెరగడంతో పాటు మరో వైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4789 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…4312 యాక్టీవ్ కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 124 మంది మృతి చెందగా 353 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడచిన 24 గంటల్లో 508 కొత్త కేసులు కాగా 13 మంది ప్రాణాలు కొల్పోయారు.(భారత్ దృష్టంతా కరోనాపైనే : తమను పట్టించుకోకపోవడంతో కొట్టుమిట్టాడుతున్న TB, HIV రోగులు )

మహారాష్ట్రలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. ఇవాళ ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం ఒక వెయ్యి 18 కేసులు నమోదయ్యయి. కరోనాతో మహారాష్ట్రలో 48 మంది మృతి చెందారు. ముంబైలో తీవ్రంగా కరోనా ఉంది. ముంబైలోనే ఇవాళ 100 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో మొత్తం 590 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే కరోనాతో 40 మంది మృతి చెందారు.

కొవిడ్-19 భయంతో కన్నతల్లి శవాన్ని కూడా తమకు సంబంధం లేదని వదిలేశారు. 69ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఇన్ఫెక్షన్ సోకి లూధియానాలోని ఫోర్టిస్ హాస్పిటల్ లో కన్నుమూసింది ఫ్యామిలీ ఆ శవం దగ్గరకు రాకపోవడమే కాదు.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో సైతం భాగం కాలేదు. పలుమార్లు ఆ మహిళ కుటుంబానికి రిక్వెస్ట్ లు పంపి స్పందించకపోవడంతో అడ్మినిస్ట్రేషనే అంత్యక్రియలు పూర్తి చేసింది. 

తహశీల్దార్ కమ్ సబ్ రిజిష్ట్రార్ అయిన జాగ్సీర్ సింగ్ కుటుంబాన్ని అడిగి అడిగి రెస్పాన్స్ లేకపోవడంతో స్మశానంలో వారే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబంలోని ముగ్గురు సభ్యులుకు పలు మార్లు ఫోన్ చేసి.. కూతురు, అల్లుడు కూడా స్పందించలేదు. చివరికి కూతురు, అల్లుడు కార్లో స్మశానం బయటే ఉండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఉండి వెళ్లిపోయారు.