కరోనా కల్లోలం : వైన్స్ లను మూసివేయం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారత దేశంలో కూడా ఈ రాకాసి ప్రవేశించింది. తొలి కేసు కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్రమ క్రమంగా..పాజిటివ్ కేసులు నమోదు కావడం, పలువురు మృతి చెందుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది.
లాక్ డౌన్ కూడా ప్రకటించింది. కానీ…వైన్స్ షాపులను మూసివేయడానికి పినరయి ప్రభుత్వం తటపటాయిస్తోంది. వైన్స్ షాపుల ఎదుట ప్రజలు ఎలా క్యూ కట్టారో..దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
మూడు అడుగుల దూరంలో నిల్చొని మందు బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం లాక్ డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మద్యం షాపులు మాత్రం ఎప్పటిలాగానే తెరిచి ఉండడం చర్చనీయాంశమైంది. వీటిని మూసివేస్తే…సామాజిక పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు భరించలేమని సీఎం పినరయి వెల్లడించారు.
కానీ ఈ విషయంలో తాము పలు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, వైన్స్ షాపుల ఎదుట ప్రజలు గుమికూడకుండా..ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమ్మకం వేళ్లలో ఆంక్షలు విధిస్తామని, బార్ల వద్ద డైనింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నామన్నారు. కేవలం కౌంటర్ల ద్వారానే మద్యం విక్రయాలు జరపాలని ఆయన సూచించారు.
Also Read | కొట్టే చేతికి తిండి పెట్టడం కూడా తెలుసు: హ్యాట్సాఫ్ పోలీస్..