ఇండియాలో కరోనా..@ 657 పాజిటివ్ కేసులు 

  • Published By: madhu ,Published On : March 26, 2020 / 01:56 AM IST
ఇండియాలో కరోనా..@ 657 పాజిటివ్ కేసులు 

Updated On : March 26, 2020 / 1:56 AM IST

భారత దేశాన్ని కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం గమనార్హం. 

కరోనా వైరస్ ను దేశం నుంచి ప్రారదోలడానికి కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. తొలుత 2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూను (14 గంటలు) పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు స్వచ్చందంగా ఈ బంద్ పాటించారు.

కానీ కేసుల సంఖ్య పెరిగిపోతుండడం, పలువురు మృతి చెందుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 రోజుల పాటు దేశ మొత్తం లాక్ డౌన్ లో ఉండాలని ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ఇతర రాష్ట్రాల్లో కూడా వైరస్ విజృంభిస్తోంది. అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు రికార్డవుతున్నాయి. తర్వాత కేరళ రాష్ట్రం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే సీన్ నెలకొంది. 
 

ఏ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారంటే :-
మహారాష్ట్ర : 3, ఢిల్లీ : 01. పంజాబ్ : 01, వెస్ట్ బెంగాల్ : 01, తమిళనాడు : 01. బీహార్ : 01. గుజరాత్ : 01. హిమాచల్ ప్రదేశ్ : 01. కర్నాటక : 01.